పటాన్‌చెరులో విచారణకు వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడి: నలుగురి అరెస్ట్

Published : Jun 10, 2021, 02:24 PM IST
పటాన్‌చెరులో  విచారణకు వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడి: నలుగురి అరెస్ట్

సారాంశం

కేసు విచారణకు వెళ్లిన కానిస్టేబుల్‌పై   నలుగురు దుండగులు దాడి చేసిన ఘటన హైద్రాబాద్ పటాన్‌చెరులో జరిగింది. ఈ ఘటనపై  బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.   


 హైదరాబాద్: కేసు విచారణకు వెళ్లిన కానిస్టేబుల్‌పై   నలుగురు దుండగులు దాడి చేసిన ఘటన హైద్రాబాద్ పటాన్‌చెరులో జరిగింది. ఈ ఘటనపై  బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దేవీలాల్ అనే వ్యక్తిపై కేసు నమోదైంది.ఈ విషయమై బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసే కానిస్టేబుల్  దేవీలాల్ కోసం ఆయన పనిచేసే ప్రాంతానికి వెళ్లాడు.

దేవీలాల్ కోసం ఆయన  విచారణ ప్రారంభించారు.ఈ విషయం తెలుసుకొన్న దేవీలాల్  సహా మరో నలుగురు కానిస్టేబుల్ ను కొట్టారు.తాను కానిస్టేబుల్ ను అని చెబుతున్నా  వినకుండా అతనిపై దాడికి దిగారు. దాడికి గురైన కానిస్టేబుల్  ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Budget 2025 : కొత్త వ్యవసాయ పథకం , తెలుగు రైతులకు బంపరాఫర్, ఫుల్ డిటైల్స్
 తెలంగాణలో దడపుట్టిస్తున్న కరోనా .. తాజాగా 4 కేసులు నమోదు