ఐసొలేషన్ వార్డుల పరిస్థితే మరీ దుర్భరంగా ఉంది. ఫీవర్ ఆసుపత్రిలో కరోనా వార్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కరోనా వార్డు స్థితిలో ఇక్కడుంటే తాను చనిపోవడంగ్యారంటీ అని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక వీడియోలో కరోనా బాధిత మహిళా ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారత దేశం కూడా ఈ వైరస్ బారినపడిబ్ వణికిపోతున్నారు దేశం మొత్తాన్ని 21 రోజులపాటు లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనా అనుమానితులను టెస్ట్ చేసి వారిని ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ... తెలంగాణలో ఏ మహమ్మారిని తరిమి కొట్టేందుకు అన్ని చర్యలను చేపడుతున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఎవ్వరికీ ఏ సమస్య రాకుండా చూసుకుంటున్నారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఐసొలేషన్ వార్డుల పరిస్థితే మరీ దుర్భరంగా ఉంది. ఫీవర్ ఆసుపత్రిలో కరోనా వార్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కరోనా వార్డు స్థితిలో ఇక్కడుంటే తాను చనిపోవడంగ్యారంటీ అని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఒక వీడియోలో కరోనా బాధిత మహిళా ఆందోళన వ్యక్తం చేసింది.
Also read:కరోనా ఎఫెక్ట్: పొందుగుల బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత, ఏపీలోకి నో ఎంట్రీ
ఆమె పోస్టు చేసిన వీడియోలో ఆ వార్డును చూపిస్తే ఒళ్ళు గగ్గురుపొడిచేలా ఉంది. అక్కడ కిటికీలు అన్ని పగిలిపోయి ఉండడం వల్ల లోపలి దోమలు విపరీతంగా వస్తున్నాయని ఆమె తెలిపింది. ఫీవర్ ఆసుపత్రికి వచ్చినప్పుడు జేయవరం లేకున్నప్పటికీ... ఇక్కడకు వచ్చాక మాత్రం ఫీవర్ రావడం గ్యారంటీ అని ఆమె తెలిపింది.
ఈ ఐసొలేషన్ వార్డులో కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేవని, బాత్రూములు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని ఆమె తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పేషెంట్లలో 35వ నెంబర్ పేషెంట్ ఈ మహిళా. ఈమెకు కరోనా పాజిటివ్ రాగ ఈ మీ భర్తకు కరోనా నెగటివ్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు.
ఆ వార్డులో కనీసం వీరి అవసరాల కోసం ఒక అటెండెంట్ కూడా లేదని, రాత్రి ఏదైనా ఎమర్జెన్సీ అయితే... కనీసం రెండు నిమిషాల దూరం ఉరికితే కానీ మరొక వార్డును చేరుకోలేమని ఆమె వాపోయారు.
ట్రీట్మెంట్ కూడా ఇప్పటివరకు ఏమీ స్టార్ట్ చేయలేదని ఆమె వాపోయారు. డాక్టర్లు తొలుత చేస్త ఆసుపత్రికి తరలిస్తామని చెప్పినప్పటికీ... ఇప్పటివరకు తరలించలేదని ఆమె అన్నారు.
ఆమె ఆ వీడియో డిస్క్రిప్షన్ లో మమ్మల్ని చావడానికి ఇక్కడ వదిలేసారు అని ఆవేదన వ్యక్తం చేసింది.