తెలంగాణ నుండి ఢిల్లీ ప్రార్థనలకు 1030 మంది: జిల్లాలవారీగా వివరాలు ఇవి

By narsimha lodeFirst Published Mar 31, 2020, 5:11 PM IST
Highlights

 తెలంగాణ నుండి ఢిల్లీలోని నిజాముద్దీన్ మత ప్రార్థనలకు 1030 మంది హాజరైనట్టుగా అధికారులు గుర్తించారు. వీరిని గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రెవిన్యూ, పోలీస్, వైద్యుల బృందాలతో ఢిల్లీకి వెళ్లిన వారిని గుర్తించేందుకు కమిటిలను ఏర్పాటు చేసింది సర్కార్.
 


హైదరాబాద్: తెలంగాణ నుండి ఢిల్లీలోని నిజాముద్దీన్ మత ప్రార్థనలకు 1030 మంది హాజరైనట్టుగా అధికారులు గుర్తించారు. వీరిని గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రెవిన్యూ, పోలీస్, వైద్యుల బృందాలతో ఢిల్లీకి వెళ్లిన వారిని గుర్తించేందుకు కమిటిలను ఏర్పాటు చేసింది సర్కార్.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 76కు చేరింది. వీరిలో ఆరుగురు మృతి చెందారు. అయితే మృతుల్లో నలుగురు ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని ప్రభుత్వం ప్రకటించింది.

దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారి కోసం ఆరా తీస్తోంది. రెండు రోజులుగా ప్రభుత్వం వీరి కోసం అన్వేషణ ప్రారంభించింది. అయితే సోమవారం నాడు రాత్రి నలుగురు మృతి చెందడంతో  వీరిని వెంటనే గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ట్రాకింగ్ బృందాలను ఏర్పాటు చేసింది.

హైద్రాబాద్ నుండే అత్యధికంగా 603 మంది ఈ ప్రార్థనల్లో పాల్గొనేందుకు వెళ్లినట్టుగా గుర్తించారు. అయితే ఈ సమావేశాలకు వెళ్లినవారి సమాచార సేకరణకు జీహెచ్ఎంసీ, పోలీస్, రెవిన్యూ అధికారులతో ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటు చేసింది సర్కార్. ఇక జిల్లాల్లో రెవిన్యూ, పోలీసులతో పాటు వైద్యులతో కమిటిలను ఏర్పాటు చేశారు.

also read:చెస్ట్ ఆసుపత్రి నుండి 10 మంది ఇండోనేషియన్ల డిశ్చార్జ్: కానీ ట్విస్ట్ ఇదీ...

హైద్రాబాద్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ప్రార్థనలకు హాజరైన వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం నాడు రాత్రి వరకు ట్రాకింగ్ పూర్తి చేయనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన వారే కారణమని ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత క్వారంటైన్ లో లేకపోవడంతో పాటు ఇతరులతో సన్నిహితంగా ఉన్న కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణమైందనే ప్రభుత్వవర్గాలు అభిప్రాయంతో ఉణ్నాయి.


జిల్లాల వారీగా నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య ఇలా ఉంది.

హైద్రాబాద్- 603
ఆదిలాబాద్-30
కొత్తగూడెం -11
జగిత్యాల-25
జనగామ- 4
భూపాలపల్లి- 1
గద్వాల -5
కరీంనగర్ -17
ఖమ్మం -27
మహబూబాబాద్- 6
మహబూబ్ నగర్- 11
మంచిర్యాల- 10
మెదక్ -2
మేడ్చల్ -2
ములుగు- 2
నాగర్ కర్నూల్- 4
నల్గొండ -45
నిర్మల్ 25
నిజామాబాద్- 80
పెద్దపల్లి- 6
సిరిసిల్ల- 9
రంగారెడ్డి- 13
సంగారెడ్డి- 22
సూర్యాపేట- 3
వనపర్తి- 3
వికారాబాద్- 7
వరంగల్ రూరల్- 1
వరంగల్ అర్బన్- 38
యాదాద్రి భువనగిరి- 4
 

click me!