ప్రధాని మోడీ పిలుపుపై వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బిజెపి ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓవైసీని మూర్ఖుడిగా, అజ్ఞానిగా అభివర్ణించారు.
కరీంనగర్: కరోనా వైరస్ వ్యాధికి చికిత్స చేస్తున్న వైద్యులకు కృతజ్ఢతలు తెలియజేయని మూర్ఖుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని బిజెపి పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ అన్నారు కరోనా కట్టడికి అందరూ తమ వంతు సాయం అందించాలని, రోగుల ఐసోలేషన్ కు వాడుకోవడానికి ఓవైసీ ఆస్పత్రిని ఇవ్వాలని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఓవైసీ చేసిన విమర్శలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఓవైసీని మత మౌఢ్యం తలకెక్కిన ఉన్మాదిగా ఆయన అభివర్ణించారు. కరోనాపై పోరాటానికి దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచిస్తే దాన్ని కూడా మత కోణంలో చూడడం ఓవైసీ అవివేకానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వైద్యులకు కృతజ్ఢతలు తెలుపడం ఓవైసీకి తెలియదని, ఇకనైనా మత రాజకీయాలు మానుకోవాలని ఆయన అన్నారు .
Also Read: 9 నిమిషాల జిమ్మిక్కులకు కుదించొద్దు: మోడీపై ఓవైసీ ఫైర్
దేశ ఐక్యత కోసం మోడీ పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు ఆదివారం రాత్రి దారుసలేం వెళ్లి చూస్తే ప్రజల స్పందన కనువిందు చేస్తుందని ఆయన అన్నారు .శనివారం హైదరాబాదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా వైద్యులపై ద్రోహులు భౌతిక దాడులకు దిగారని, అయినా సహనంతో వారు సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు.
కరోనా బారిన పడి వేలమంది బాధపడుతుంటే ఓవైసీ ఆస్పత్రిని ఐసోలేషన్ వార్డుకు ఇచ్ిచ వాళ్లకు ధైర్యం చెప్పలేని అజ్ఞాని ఓవైసీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓవైసీకి దమ్ముంటే వైద్యులపై, నర్సులపై, పోలీసులపై, ఆశావర్కర్లపై దాడులు ఆగేలా చూడాలని ఆయన అన్నారు.