మంచి మనసు చాటుకున్న కేటీఆర్... నాలుగేళ్ల క్యాన్సర్ చిన్నారికి వైద్యసాయం

By Arun Kumar PFirst Published Apr 4, 2020, 1:09 PM IST
Highlights

లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నాలుగేళ్ల క్యాన్సర్ చిన్నారికి మంత్రి కేటీఆర్ వైద్యసాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక, పారిశ్రామిక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న కుటుంబానికి అండగా నిలిచారు. తన లాంటి ఓ తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్న మంత్రి ఓ చిన్నారికి వైద్యసాయాన్ని అందించారు. కేటీఆర్ ఆదేశాలతో ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ కు చెందిన మొయిన్ అనే వ్యక్తి కుమార్తె (4 సంవత్సరాల) ను హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలా మంత్రులిద్దరు మానవత్వాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన మెయిన్ కు నాలుగు సంవత్సరాల కూతురు ఉంది. పాపం ఆ చిన్నారి అతి చిన్న వయసులోనే కాన్సర్ బారిన పడింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో నిత్యం చికిత్స పొందుతోంది. 

అయితే ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసఆర్) ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈనెల 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో పాపం మెయిన్ తన కుమార్తెను వైద్యంకోసం మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్ కు తీసుకెళ్లడానికి ఇబ్బందిపడుతున్నారు. 

దీంతో తన  పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాల్సిందిగా మోయిన్ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా వేడుకున్నాడు. దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సదరు కుటుంబానికి సాయం చేయాల్సిందిగా కోరారు. దీంతో మంత్రి జిల్లా పోలీసు ఉన్నతాధికారుల సాయంతో బాలికను  సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. 


 

click me!