లైట్లార్పితే తెలంగాణలో ఏమీ కాదు, మన గ్రిడ్లు స్ట్రాంగ్: విద్యుత్ శాఖా సీఎండీ ప్రభాకర్ రావు

By Sree sFirst Published Apr 4, 2020, 1:43 PM IST
Highlights

తెలంగాణలో మాత్రం లైట్లు ఆర్పితే ఎలాంటి సమస్య లేదని, ఇక్కడి గ్రిడ్లు అన్ని పటిష్టంగా ఉన్నాయని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుత్ లైట్లు ఆర్పేసి ప్రధాని మోడీ పిలుపుకు స్పందించాలని, అందరూ సంఘీభావం తెలపాలని ఆయన కోరారు. 

కరోనాపై పోరులో భాగంగా దేశంలో లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఉదయం ప్రజలందరినీ మరో మారు సంఘీభావం తెలపాలని  కోరారు. 

రేపు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని లైట్లు అన్ని కాటేసి, ఎవ్వరి బాల్కనీలోకి, గడపల వద్దకు వారు వచ్చి దీపాల్ని వెలిగించాలని కోరారు. ఇలా కొవ్వొత్తి కానీ, దీపాన్ని గాని వెలిగించలేకపోతే.... కనీసం మొబైల్ లో టార్చ్ లైట్ ను అయినా 9 నిమిషాలపాటు ఆన్ చేయాలనీ ప్రధాని కోరారు. 

ఇలా గనుక లైట్లను ఆర్పేస్తే చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని చాలా రాష్ట్రాల విద్యుత్ బోర్డులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. మహారాష్ట్ర సర్కార్ ఏకంగా లైట్లు బంద్ చేయొద్దు అని ప్రజలకు పిలుపునిచ్చింది. 

తెలంగాణలో మాత్రం లైట్లు ఆర్పితే ఎలాంటి సమస్య లేదని, ఇక్కడి గ్రిడ్లు అన్ని పటిష్టంగా ఉన్నాయని సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుత్ లైట్లు ఆర్పేసి ప్రధాని మోడీ పిలుపుకు స్పందించాలని, అందరూ సంఘీభావం తెలపాలని ఆయన కోరారు. 

లైట్లు ఆర్పేస్తే గ్రిడ్లు దెబ్బతింటాయని వాదనలో వాస్తవం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజానీకానికి కరోనా నేపథ్యంలో విద్యుత్ బిల్లులను ఆన్ లైన్ లో కట్టాలని ఆయన తెలిపారు. 

ఇదిలా ఉండగా తెలంగాణకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ఇలా చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చని ఒక విన్నపం చేసారు. 

"5 న రాత్రి 9 గంటలకు దీపాలను వెలిగించాలని ప్రధాని పిలుపు ఇచ్ఛా రు. ఇలా చేస్తున్నప్పుడు, లైట్లు ఆపివేయమని ఆయన సూచించారు. కానీ, ఇప్పటికే, అన్ని పారిశ్రామిక మరియు వాణిజ్య లోడ్లు ఆఫ్‌లో ఉన్నందున, మాకు గ్రిడ్‌లో దేశీయ లోడ్లు మరియు అవసరమైన సేవల లోడ్లు మాత్రమే ఉన్నాయి. 

Also Read:కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంతో వైద్యం: వందేళ్ల నాటి విధానంతో అమెరికాలో ప్రయోగం

(ప్రస్తుత) లైటింగ్ లోడ్ మొత్తం లోడ్ కంటే 40% కన్నా తక్కువ కాబట్టి, గ్రిడ్‌లోని అన్ని లైట్ల ఆకస్మిక (ఏకకాలంలో) స్విచ్-ఆఫ్ చేయడం విద్యుత్తు కుప్పకూలిపోవచ్చు (భారీ లోడ్ అకస్మాత్తుగా పడిపోవడం).  కాబట్టి, దయచేసి, ఫ్రిజ్‌లు మరియు ఎసిలు వంటి కొన్ని లోడ్‌లను ఆన్‌లో ఉంచమని ప్రజలకు సలహా ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.  గ్రిడ్ కూలిపోతే, రోగులకు చికిత్స చేస్తున్న అన్ని ఆసుపత్రులు వారి క్లిష్టమైన విద్యుత్ సరఫరాను కోల్పోవచ్చు.  గ్రిడ్‌ను సేవ్ చేయడానికి దయచేసి అందరూ ఈ నియమాలను పాటించండి అని కోరారు."

ఇప్పటికే ఇలా గ్రిడ్ లకు ఇబ్బంది కలగొచ్చని ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ కొన్ని మార్గదర్శకాలని కూడా జారీ చేసింది. లోడ్ అంతా డౌన్ అయితే గ్రిడ్ షట్ డౌన్ కి దారి తీస్తుంది. ఉత్పత్తయిన విద్యుత్ ని పంపకం చేసినప్పుడు ఎవ్వరు వాడకపోతే గ్రిడ్ పూర్తిగా షట్ డౌన్ అవుతుంది. 

పోనీ వేరే గ్రిడ్ కయినా ట్రాన్స్ఫర్ చేద్దామా అంటే... దేశమంతా ఇలానే ఆఫ్ చేస్తారు అందువల్ల గ్రిడ్ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి మహారాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకుడు ఇలా గనుక చేస్తే 15 నుంచి 16 గంటలపాటు గ్రిడ్ షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. 

ఒకే మారు లోడ్ ని తగ్గియలేరు. అది చేయాలాఅంటే... దాదాపుగా ఒక గంట ముందు నుంచే లోడ్ షెడ్డింగ్ ఆరంభించవలిసి ఉంటుంది. అంటే 8 గంటలా నుంచి నెమ్మది నెమ్మదిగా పవర్ కట్స్ మొదలుపెట్టాలి. 

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఫ్రీ గవర్నింగ్ మోడ్ లో ఉంచి విద్యుత్ ఉత్పాదనను సాధ్యమైనంత మేర తగ్గించమని చెప్పాలి. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే 3000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పడిపోతుందని అంచనా. 

ఒక్క రాష్ట్రంలోనే ఇలా 3000 మెగావాట్ల అంటే... దేశం మొత్తంలో ఊహించవచ్చు. రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ బోర్డులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా కనీసం ఉదయం వరకు ఇళ్లలో కరెంటు ఉండదు. 

click me!