కరోనా: నిజామాబాద్‌లో హోంక్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి

By narsimha lodeFirst Published Apr 5, 2020, 12:29 PM IST
Highlights

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం కంజర గ్రామంలో కరోనా అనుమానితుడు ఆదివారం నాడు మృతి చెందాడు.  గత నెలలో ఆయన దుబాయ్ నుండి వచ్చాడు. 

నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం కంజర గ్రామంలో కరోనా అనుమానితుడు ఆదివారం నాడు మృతి చెందాడు.  గత నెలలో ఆయన దుబాయ్ నుండి వచ్చాడు. 

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.  దీంతో జిల్లా అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు. గత మాసంలో దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తిని  అధికారులు హోం క్వారంటైన్ లో ఉంచారు. హోం క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

చనిపోయిన వ్యక్తికి కరోనా ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు గుర్తించనున్నారు. విదేశాల నుండి వచ్చినందున అతడిని హోం క్వారంటైన్ లో ఉంచారు. విదేశాల నుండి వచ్చిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Also read:విజృంభిస్తున్న కరోనా: తెలంగాణలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు, మొత్తం 272

దీంతో అతడిని హోం క్వారంటైన్ లో ఉంచారు. హోం క్వారంటైన్ లో ఉన్న వ్యక్తి మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య కూడ జిల్లాలో కూడ అత్యధికంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ లక్షణాలు పెరుగుతున్నాయి. తెలంగాణలో 272 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.  ఢిల్లీలో మర్కజ్ లో ప్రార్ధనల్లో పాల్గోని వచ్చినవారి నుండే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టుగా  గణాంకాలు చెబుతున్నాయి.
 

click me!