హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కుత్బుల్లాపూర్ కు చెందిన రోగి బంధువులు దాడి చేయడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గురువారం నుండి నిరసనకు దిగారు. జూనియర్ డాక్టర్లతో రమేష్ రెడ్డి సమావేశమయ్యారు
హైదరాబాద్: హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కుత్బుల్లాపూర్ కు చెందిన రోగి బంధువులు దాడి చేయడాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గురువారం నుండి నిరసనకు దిగారు. జూనియర్ డాక్టర్లతో రమేష్ రెడ్డి సమావేశమయ్యారు.
కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు బుధవారం నాడు మృతి చెందారు. దీంతో మృతుడి బంధువులు డాక్టర్లపై దాడికి దిగిన విషయం తెలిసిందే.
undefined
Also read:గాంధీ వైద్యులపై దాడిపై సీరియస్: కరోనా రోగితో పాటు మరో ముగ్గురిపై కేసు
ఈ దాడితో జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. కరోనా వైరస్ సోకిన రోగులు చికిత్స పొందుతున్న వార్డుల్లో సీఆర్‌పీఎఫ్ బలగాలను ఏర్పాటు చేయాలని జూడాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
గురువారం ఉదయం నుండి నిరసనకు దిగిన జాడాలతో డిఎంఈ రమేష్ రెడ్డి సమావేశమయ్యారు. కరోనా వైరస్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించే తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరుతున్నారు. మరోసారి తమపై దాడులు జరిగితే విధులు బహిష్కరించాలని జూడాలు భావిస్తున్నారు.
నిరసనకు దిగిన జూడాలతో డిఎంఈ రమేష్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఈ విషయం తెలుసుకొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గాంధీ ఆసుపత్రికి వచ్చారు. జూనియర్ డాక్టర్లను కలిసి వారిని సముదాయించారు. దాడులు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని మంత్రి హమీ ఇచ్చారు.
డాక్టర్లపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. డాక్టర్లకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందన్నారు.