గాంధీ వైద్యులపై దాడిపై సీరియస్: కరోనా రోగితో పాటు మరో ముగ్గురిపై కేసు

By narsimha lodeFirst Published Apr 2, 2020, 12:54 PM IST
Highlights

గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన వారిపై పోలీసులు గురువారం నాడు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ ఒకరు బుధవారం నాడు సాయంత్రం మృతి చెందాడు. దీంతో మృతుల బంధువులు గాంధీ ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగిన విషయం తెలిసిందే.
 

హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన వారిపై పోలీసులు గురువారం నాడు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ ఒకరు బుధవారం నాడు సాయంత్రం మృతి చెందాడు. దీంతో మృతుల బంధువులు గాంధీ ఆసుపత్రి సిబ్బందిపై దాడికి దిగిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ సోకిన వ్యాధిగ్రస్తులకు తమ ప్రాణాలకు ఫణంగా పెట్టి వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందిపై దాడి చేయడంపై పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకొంది. ఈ దాడికి పాల్పడిన వారిలో ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు గురువారం నాడు కేసు నమోదు చేశారు.

also read:పార్శిగుట్టలో మర్కజ్ యాత్రికులంటూ ఆరుగురిపై ఫిర్యాదు: ఒకరి అరెస్ట్, ఐదుగురు జంప్

ఈ దాడికి తట్టుకోలేక వైద్య సిబ్బంది బుధవారం నాడు రాత్రి తలో దిక్కు పారిపోయారు. స్థానిక పోలీసులు సరిగా పట్టించుకోని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ కుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే.

Also read:గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగి మృతి: బంధువుల ఆగ్రహం, వైద్యుల దాడి

గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడికి పాల్పడింది హైద్రాబాద్ కుత్బుల్లాపూర్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ దాడి జరిగిన విషయం తెలుసుకొన్న హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ బుధవారం నాడు రాత్రి గాంధీ ఆసుపత్రికి చేరుకొన్నారు.

బుధవారం నాడు ఘటనను దృష్టిలో ఉంచుకొని గురువారం నాడు ఉదయం నుండి గాంధీ ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వైద్యులు కోరుతున్నారు.


 

click me!