కరోనా కలకలం: నల్గొండలో మతప్రచారానికి వచ్చిన 17 మంది విదేశీయులు, పరీక్షల కోసం గాంధీకి

By Sree s  |  First Published Apr 2, 2020, 1:13 PM IST

గత నెల మార్చి పదిహేడున మత ప్రచార నిమిత్తం నల్గొండకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. వారికి కరోన ఉందా లేదా అనే విషయం నిర్ధారించడానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రావలసి ఉంది. 


నల్గొండ పట్టణంలో మతప్రచారం నిమిత్తం వచ్చిన పదిహేడు మంది మయన్మార్ దేశస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరిని కరోనా పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కి తరలించారు. వారికి టెస్టులు పూర్తయ్యాయని, రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

వారు గత నెల మార్చి పదిహేడున మత ప్రచార నిమిత్తం నల్గొండకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. వారికి కరోన ఉందా లేదా అనే విషయం నిర్ధారించడానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రావలసి ఉంది. 

Latest Videos

మార్కజ్ నిజాముద్దీన్ కరోన కేసులు దేశాన్ని కుదిపేస్తున్న ఈ సందర్భంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.ఇకపోతే మర్కజ్ నిజాముద్దీన్ ఘటనవల్ల దేశమంతా కరోనా కేసుల సంఖ్యా అమాంతం పెరిగిపోతుంది. దీనితో అధికారులు ఎక్కడైనా ఢిల్లీకి వెళ్లి వాక్సచినవారు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. 

ఈ నేపథ్యంలో.... సికింద్రాబాద్ పార్శిగుట్టలో ఆరుగురు ఢిల్లీ నుండి వచ్చిన మర్కజ్ యాత్రికులు సంచరిస్తున్నారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల రాకతో ఐదుగురు పారిపోయారు. వీరిలో ఒకరిని పోలీసులు  అరెస్ట్ చేశారు. అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

పార్శిగుట్టలో ఢిల్లీ నిజాముద్దీన్ నుండి వచ్చిన మర్కజ్ యాత్రికులు తిరుగుతున్నారనే అనుమానంతో స్థానికులు గురువారం నాడు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరుగురికి కరోనా లక్షణాలు ఉన్నాయని స్థానికులు అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. అయితే పార్శిగుట్ట ప్రాంతానికి చేరుకొన్న పోలీసులను చూడగానే మర్కజ్ నుండి వచ్చినట్టుగా అనుమానిస్తున్న యాత్రికులు పారిపోయారు. వారిలో ఒకరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొన్నారు. మరో ఐదుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అదుపులోకి తీసుకొన్న వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి ఢిల్లీ మర్కజ్ ప్రాంతానికి వెళ్లి వచ్చిన వారే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Also read:కరోనా ఎఫెక్ట్: తొలిసారిగా భక్తులు లేకుండానే భదాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

ఢిల్లీ నుండి తమ స్వగ్రామాలకు వెళ్లిన వారి నుండే ఎక్కువగా ఈ కేసులు నమోదు అవుతున్నట్టుగా ఆయా రాష్ట్రాలు ప్రకటించిన విషయం తెలిసందే.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి కూడ ఢిల్లీ నుండి వచ్చినవారే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

click me!