మామయ్య చనిపోతే... మీ నిర్ణయం గొప్పది: ఒమర్ అబ్ధుల్లాపై మోడీ ప్రశంసలు

By Siva Kodati  |  First Published Mar 30, 2020, 4:53 PM IST

నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లాపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల వర్షం కురిపించారు.


నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లాపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి ఒమర్ అబ్ధుల్లా మామయ్య మహ్మద్ అలీ మట్టూ తీవ్ర అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.

దీనిపై స్పందించిన ఒమర్ .... కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉందని, మామయ్య చనిపోయిన సరే.. ఎవ్వరూ అధిక సంఖ్యలో గుమిగూడవద్దని ఆయన ట్వీట్ చేశారు.

Latest Videos

Also Read:కరోనా ఎఫెక్ట్: తిండి తిప్పలు లేకుండా 114 కి.మీ నడిచిన గర్భిణీ

ఈ కష్టకాలంలో భారత ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, బంధుమిత్రులు ఇంటి నుంచే ప్రార్థనలు చేయాలని.. అవి ఫలించి, మామయ్య ఆత్మకు శాంతి చేకూర్చుతాయని ఒమర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read:వలస కార్మికులపై అమానుషం: రోడ్డుపై వరుసగా కూర్చోబెట్టి రసాయనాలు స్ప్రే

అబ్ధుల్లా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇంతటి విషాధ సమయంలో కూడా ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడవద్దని మీరిచ్చిన పిలుపు ప్రశంసనీయమని మోడీ అన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న యుద్ధానికి మీరు మరింత శక్తిని చేకూర్చారని ప్రధాని  నరేంద్రమోడీ ట్వీట్ చేశారు.

కాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాదాపు 8 నెలల పాటు నిర్బంధంలో ఉన్న ఒమర్ అబ్ధుల్లా ఇటీవల విడుదల అయ్యారు. అయితే  తనతో పాటు అదుపులోకి  తీసుకున్న ఇతరులను విడుదల చేయాలని, హైస్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్దరించాలని ఒమర్ ప్రభుత్వాన్ని  కోరారు. 

click me!