కరోనా ఎఫెక్ట్: తిండి తిప్పలు లేకుండా 114 కి.మీ నడిచిన గర్భిణీ

By narsimha lodeFirst Published Mar 30, 2020, 4:13 PM IST
Highlights

:కరోనా కారణంగా లాక్ డౌన్ వలస కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. స్వగ్రామం చేరుకోవడం కోసం వలస కార్మికుడు కాలినడకనే బయలుదేరాడు. 8 నెలల గర్భిణీగా ఉన్న భార్యను కూడ తనతో పాటు నడిపించాడు

లక్నో:కరోనా కారణంగా లాక్ డౌన్ వలస కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. స్వగ్రామం చేరుకోవడం కోసం వలస కార్మికుడు కాలినడకనే బయలుదేరాడు. 8 నెలల గర్భిణీగా ఉన్న భార్యను కూడ తనతో పాటు నడిపించాడు. ఒకటి కాదు రెండు ఏకంగా సుమారు 114 కి.మీ దూరం పాటు నడిచారు. వీరిని చూసిన పోలీసులు వారిని స్వగ్రామం చేర్చేందుకు వాహనం ఏర్పాటు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని షహ్రాన్‌పూర్ లో ఓ ఫ్యాక్టరీలో వకీల్ అనే వ్యక్తి కార్మికుడిగా పనిచేస్తున్నాడు.  ఆయన భార్య యాస్మిన్  ప్రస్తుతం గర్భవతి. కరోనా కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఈ ఫ్యాక్టరీని మూసివేశారు. దీంతో వకీల్ కు పని లేకుండా పోయింది.  తాను ఉంటున్న ఇల్లును కూడ ఆయన ఖాళీ చేయాల్సి వచ్చింది.

దీంతో ఆయన తన స్వగ్రామానికి వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. షహ్రాన్‌పూర్ నుండి తన స్వగ్రామం అమర్‌ఘడ్ కు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

తన స్వంత గ్రామానికి గర్భవతి అయిన భార్యను తీసుకొని వకీల్ కాలినడకన బయలుదేరాడు. లాక్ డౌన్ కారణంగా రోడ్డు వెంట ఉన్న హోటల్స్ కూడ మూసివేశారు. దీంతో కనీసం భోజనం కూడ లేకుండా పోయింది. 

తిండి తిప్పలు లేకుండా ఈ జంట రెండు రోజులుగా నడుచుకొంటూ శనివారం నాడు షొహ్రాబ్ గేట్ బస్టాండ్ వద్దకు చేరుకొన్నారు. ఈ జంటను చూసిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఈ దంపతులకు వద్దకు వచ్చి వారి పరిస్థితి గురించి సమాచారాన్ని సేకరించారు.  స్థానికులు కొంత డబ్బును ఆ దంపతులకు ఇచ్చారు. ఈ జంట తమ స్వగ్రామం అమర్ ఘడ్ చేరేందుకు అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు.

also read:కరోనాతో గుజరాత్‌లో 45 ఏళ్ల మహిళ మృతి: ఆరుకు చేరిన మృతుల సంఖ్య

లాక్‌డౌన్ ప్రభావం వలస కార్మికులపై తీవ్రంగా కన్పిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.


 

click me!