జియో మరో సరికొత్త ప్లాన్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వారికి ప్రత్యేకం..

By Sandra Ashok Kumar  |  First Published May 9, 2020, 11:29 AM IST

కరోనా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో వివిధ సంస్థల ఉద్యోగులు ‘ఇంటి వద్ద నుంచి పని’ చేస్తున్నారు. ఇందుకోసం రిలయన్స్ జియో రూ.251తోపాటు మూడు కొత్త ప్లాన్లను తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.


న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నుంచి సరికొత్త వర్క్ ఫ్రం హోం ప్లాన్ వచ్చేసింది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల డేటా డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దీనిని విడుదల చేసింది. ఇందుకోసం మూడు ప్లాన్లను తన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ భారతదేశంలో మరికొంత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రంగాల ఉద్యోగులు ప్రత్యేకించి ఐటీ రంగ ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ సేవలందించాల్సి రావచ్చు. ఈ క్రమంలో వివిధ సంస్థల ఉద్యోగులు, క్లయింట్లు, యాజమాన్యాల మధ్య వీడియో కాల్స్ చేయడానికి అదనపు డేటా అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్. 

Latest Videos

ప్రస్తుతం ఉన్న రూ.2,121 ప్లాన్‌కు అదనంగా రూ.2,399తో రిలయన్స్ జియో మరో దీర్ఘకాలిక ప్లాన్‌ తీసుకొచ్చింది. దీని కాలపరిమితి 365 రోజులు. ఈ ప్లాన్‌లో రోజుకు రెండు జీబీల డేటా లభిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.2,121 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని కాలపరిమితి 336 రోజులే. 

అలాగే, వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారి కోసం రూ. 151, రూ.201, రూ.251 డినామినేషన్లలో యాడ్ ఆన్ ప్యాక్స్‌ను కూడా రిలయన్స్ ఆఫర్ చేస్తోంది. వీటిలో రోజు వారీ డేటా పరిమితి లేదు. గరిష్టంగా 50 జీబీ డేటా లభిస్తుంది. ఇప్పటికే రూ.11లకే 0.8 జీబీ డేటా, రూ.21లకు ఒక జీబీ డేటా, రూ.31లకు రెండు జీబీల డేటా, రూ.51లకు 6జీబీ డేటా, రూ.101లకు 12 జీబీ డేటా ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్ జియో. 

also read గూగుల్ & ఫేస్‌బుక్ సంచలనం... ఉద్యోగులు 2021 వరకూ వర్క్ ఫ్రం హోం

డేటాను ఎక్కువగా ఉపయోగించే వారికి ఇవి బాగా ప్రయోజనకరంగా ఉంటాయి. రోజు వారీ డేటా అయిపోయినప్పుడు నెలలో ఏ టైంలోనైనా వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుత ధరవరల ప్రకారం నెలకు రూ.200లకు నూతన ప్లాన్ తీసుకొచ్చింది జియో. 

రిలయన్స్ జియోతోపాటు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా ప్రతి రోజూ 1.5 జీబీ డేటా ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్, వొడాఫోన్ ప్లాన్లతో పోలిస్తే జియోలో 25 శాతం అదనపు డేటా లభిస్తుంది. రిలయన్స్ జియో రూ.2,121లకే 336 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తోంది. 

ఇదిలా ఉంటే కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రానందున ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం సర్వసాధారణం కావచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వివిధ సంస్థలు తమ ఉద్యోగులతో ఇంటివద్ద నుంచే పని చేయించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ప్రస్తుత తరుణంలో వర్క్ ఫ్రం హోం ఒక్కటే పరిష్కారమని గ్లోబల్ వర్క్‌ప్లేస్ అనలిటిక్స్ ప్రెసిడెంట్ కేట్ లిస్టర్ వ్యాఖ్యానించారు. పలు దేశాల్లో కరోనా వైరస్ ప్రబలుతుండగా లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ ఆర్థిక వ్యవస్థలను తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచం ఎలా పనిచేయాలనే విషయంపై కార్పొరేట్ కంపెనీల అధిపతులు, ఐటీ నిపుణులు సమాలోచనలు జరుపుతున్నారు. 

కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని కొనసాగిస్తారా? లేదా కొంతమంది ఉద్యోగులు రోస్టర్ పద్దతి ప్రకారం కార్యాలయానికి పిలుస్తారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. చాలా కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే పద్ధతిని కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నాయని కేట్ లిస్టర్ చెప్పారు. 

click me!