ఎస్‌బీఐ ఉద్యోగికి కరోనా వైరస్... కార్యాలయం మూసివేత..

By Sandra Ashok Kumar  |  First Published May 8, 2020, 7:17 PM IST

భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కోల్‌కతాలోని లోకల్ హెడ్ ఆఫీస్ (ఎల్‌హెచ్‌ఓ)లో  ఒక సహ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో అతను పనిచేస్తున్న విభాగాన్ని మూసివేసింది. 


కోల్‌కతా: కరోనా వైరస్ సోకి ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కోల్‌కతాలోని లోకల్ హెడ్ ఆఫీస్ (ఎల్‌హెచ్‌ఓ)లో  ఒక సహ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో అతను పనిచేస్తున్న విభాగాన్ని మూసివేసింది.

ఉద్యోగి ఎల్‌హెచ్‌ఓ లోని 'ఈ' విభాగంలో విధులు నిర్వహిస్తాడని సంస్థ ప్రకటించింది. ఎస్‌బి‌ఐ ఉద్యోగి కరోనా వైరస్ సోకికముందే గత 8-10 రోజులుగా కార్యాలయానికి సెలవు పెట్టడాని తరువాత అని సంస్థ తేలిపింది. అప్పటి నుండి, మేము మొత్తం భవనాన్ని శుభ్రపరిచాము అలాగే మే 11 వరకు అతను పనిచేసిన విభాగం మూసివేసాము" అని ఎస్‌బి‌ఐ అధికారి తెలిపారు.

Latest Videos

also read కరోనా ఎఫెక్ట్ : కోటక్ మహీంద్ర ఉద్యోగుల వేతనాలలో కోత...

ఇందులో ఉన్న ఇతర విభాగాలు మాత్రం పనిచేస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ఉద్యోగి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్నార."బాధ్యతాయుతమైన సంస్థగా,ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగుల సంక్షేమాన్ని పరిశీలిస్తూ, అన్ని నిబంధనలను అనుసరిస్తున్నామని అధికారి తెలిపారు.  ఒక విదేశీ దేశానికి వెళ్లిన మరో ఎస్‌బి‌ఐ సిబ్బంది కూడా పాజిటివ్ పరీక్షలు చేశారని, అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్నారని ఆయన అన్నారు.

మరోవైపు పంజాబ్ లోని ఎస్‌బీఐలో పనిచేస్తున్న ఉద్యోగికి  ఆమె కుమార్తెకు కరోనా పాజటివ్ తేలడంతో పంజాబ్ లోని పాటియాలా నగరంలో ఎస్‌బీఐ  రెండు శాఖలు మూసివేసినట్టు సమాచారం. వీరిని క్వారంటైన్ లో ఉంచామని పాటియాలా సివిల్ సర్జన్ డాక్టర్ హరీష్ మల్హోత్రా తెలిపారు. 


మే 7 నాటికి, పశ్చిమ బెంగాల్‌లో 1,548 కరోనా వైరస్ కేసులు నమోదవగా 151 మంది మరణించారు. రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాల్లోని ఏడు గ్రామీణ జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదవ్వలేదు అని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
 

click me!