ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ అప్పుడే రిటైల్ బిజినెస్ ప్రారంభించింది. 1500 కస్టమర్ టచ్ పాయింట్లు తెరవడంతోపాటు 10 వేల వాహనాలను విక్రయించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ రిటైల్ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించింది. అథరైజ్‌డ్ డీలర్‌షిప్స్, సర్వీస్ సెంటర్లు సహా 1500 కస్టమర్ టచ్ పాయింట్లను తెరిచింది.
కస్టమర్ టచ్ పాయింట్లను తెరిచినప్పటి నుంచి ఇప్పటికే 10 వేల మోటార్ సైకిళ్లు, స్కూటర్లను హీరో మోటో కార్ప్స్ విక్రయించింది. సంస్థ మొత్తం దేశీయ రిటైల్ అమ్మకాల్లో ఈ అవుట్‌లెట్లు 30 శాతం వాటా కలిగి ఉంటాయి.
undefined
తమ వినియోగదారులు, డీలర్‌షిప్ సిబ్బంది భద్రత, శ్రేయస్సుకు సంస్థ అధిక ప్రాధాన్యం ఇస్తుందని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఈ మేరకు భద్రతా నియమావళిని మూడు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఉద్యోగులతో పంచుకుంది. ప్లాంట్ ప్రాంగణంలో భద్రత, పరిశుభ్రతపై దృష్టి సారించినట్టు పేర్కొంది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో మూసివేసిన తయారీప్లాంట్లను తిరిగి తెరిచి కార్యకలాపాలను ప్రారంభించిన తొలి కంపెనీ హీరో మోటో కార్స్ప్ కావడం గమనార్హం. ఈ నెల ఏడో తేదీ నుంచి డీలర్లకు వాహనాల సరఫరా ప్రారంభించినట్లు వెల్లడించింది.
also read హ్యుండాయ్ నుంచి తొలిరోజే 200 కార్లు.. ఇవీ ఫైనాన్స్ స్కీమ్‌లు
హర్యానాలోని ధరుహేరా, గురుగ్రామ్ ప్లాంట్లతోపాటు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న ప్లాంట్‌ను ఈ నెల నాలుగో తేదీన తిరిగి తెరిచింది. గురువారం తన ప్లాంట్ నుంచి వాహనాలను డిస్పాచ్ చేసింది. కాగా, కరోనా వైరస్ మహమ్మారి భయపెడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 22న ‘హీరో మోటో కార్ప్స్’ తన అన్ని తయారీ ప్లాంట్లను మూసివేసింది.
లాక్ డౌన్‌తో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాలు ఆదుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించినా తాము ఆ పని చేయబోమని ప్రకటించిన సంస్థ హీరో మోటో కార్ప్స్. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమ అంతర్గత వనరులను వాడుకుంటామని పేర్కొన్నది.
నేటి నుంచి గోల్డ్ బాండ్ల విక్రయం
ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో రెండో విడుత గోల్డ్ బాండ్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. ప్రస్తుతం బంగారానికి విపరీతమైన డిమాండ్ కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఆదరణ లభించగలదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ నెల 15తో సబ్‌స్క్రిప్షన్ ముగియనున్నది. గ్రాము ధర రూ.4,590గా నిర్ణయించారు. డిజిటల్ వేదికల ద్వారా కొన్నవారికి రూ.50 రాయితీ లభిస్తుంది. కేంద్రం తరఫున ఈ బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తుంది.