ఈ ఉత్పత్తులు కొనుగోలుదారులకు సామ్‌సంగ్ సొంత రిటైల్, డిస్ట్రిబ్యుటర్ ద్వారా పంపిణీ చేయబడతాయి. వినియోగదారులు తమ ఇంటి నుండి బయటకు రాకుండనే కొత్త ఉపకరణాలు, గాడ్జెట్‌లను నేరుగా వారి ఇంటి వద్దకే అందించనున్నారు.
లాక్ డౌన్ ఎత్తివేసినాక వెంటనే టెలివిజన్లు, డిజిటల్ ఉపకరణాలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నార అయితే మీకో గుడ్ న్యూస్ ఇంటి నుండి బయటికి అడుగుపెట్టకుండానే వాటిని కొనుగోలు చేసేంధుకు శామ్సంగ్ ఒక కొత్త ఆఫర్లను, పథకాన్ని ప్రకటించింది. ఏంటంటే కొనుగోలుదారులు సామ్‌సంగ్ వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
ఈ ఉత్పత్తులు కొనుగోలుదారులకు సామ్‌సంగ్ సొంత రిటైల్, డిస్ట్రిబ్యుటర్ ద్వారా పంపిణీ చేయబడతాయి. వినియోగదారులు తమ ఇంటి నుండి బయటకు రాకుండనే కొత్త ఉపకరణాలు, గాడ్జెట్‌లను నేరుగా వారి ఇంటి వద్దకే అందించనున్నారు.
ఉత్పత్తుల డెలివరీపై ఖచ్చితమైన తేదీని కంపెనీ వెల్లడించనప్పటికీ, లాక్ డౌన్ ముగిసిన వెంటనే మీరు ప్రీ-బుక్ చేసిన ఉత్పత్తుల డెలివరీలు ప్రారంభిస్తాము అని పేర్కొంది.
also read జియో మరో సరికొత్త ప్లాన్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వారికి ప్రత్యేకం..
‘స్టే హోమ్. స్టే హ్యాపీ.. లాగ్ ఇన్ టు గ్రేట్ ఆఫర్స్' పేరుతో ఆన్‌లైన్ ప్రీ బుకింగ్ ఆఫర్స్ అందిస్తున్నది. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ ఓవెన్‌లు తదితర గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం శాంసంగ్ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రీ-బుక్ చేసుకున్నవాటిపై 15 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు ఇంకా ఎక్స్‌ప్రెస్ డెలివరీతో పాటు 18 నెలల వరకు ఫైనాన్స్ ఆప్షన్ జీరో ఈఎంఐ కూడా పొందవచ్చు.
ఈ ఆఫర్ సమయంలో, వినియోగదారులు శామ్సంగ్ ఉత్పత్తులైన క్యూఎల్‌ఇడి 8కె టివిలు, క్యూఎల్‌ఇడి 4కె టివిలు, కన్వర్టిబుల్ 5 ఇన్ 1 కర్డ్ మాస్ట్రో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్లిమ్ ఫ్రై టెక్నాలజీస్ వంటి ప్రీ-బుక్ చేసుకోవచ్చు. శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి ఇంట్లో ఉన్న విద్యార్థులు వారి ఆన్‌లైన్ లెర్నింగ్ క్లాసుల కోసం ఉపయోగించవచ్చు.
శామ్‌సంగ్ షాపులో ప్రీ-బుకింగ్ చేసే వినియోగదారులకు హెచ్‌డిఎఫ్‌సి డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లించేటప్పుడు 15 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది, అలాగే నో-కాస్ట్ ఇఎంఐలు, దీర్ఘకాలిక ఫైనాన్స్ ఆప్షన్ 18 నెలల వరకు లభిస్తాయి. వినియోగదారులు ఈఎంఐ ఫైనాన్స్ ఆప్షన్ ఎంచుకోకపోయినా క్యాష్‌బ్యాక్‌కు అర్హులు.
ఇంకా, శామ్‌సంగ్ టెలివిజన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు ప్యానెల్‌లో 1 + 1 అదనపు వారంటీతో జీ5 ప్రీమియం ప్యాక్ 30 రోజుల ట్రయల్ ఆఫర్ లభిస్తుంది. స్మార్ట్ ఓవెన్లలో, వినియోగదారులకు 10 సంవత్సరాల సిరామిక్ ఎనామెల్ వారంటీ, ఉచిత బోరోసిల్ కిట్, 5 సంవత్సరాల మాగ్నెట్రాన్ వారంటీ లభిస్తుంది.