లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. డబ్బున్న ప్రజల జీవితానికి ఎటువంటి ఢోకాలేకున్నప్పటికీ.... రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజల జీవితాలు మాత్రం తీవ్ర గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేయ బడ్డాయి.
ప్రపంచంతో పాటు దేశమంతా లాక్ డౌన్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. డబ్బున్న ప్రజల జీవితానికి ఎటువంటి ఢోకాలేకున్నప్పటికీ.... రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజల జీవితాలు మాత్రం తీవ్ర గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టివేయ బడ్డాయి.
ఈ విషయాన్నీ అర్థం చేసుకునే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికందరికీ ఈ కష్టకాలంలో ఉపశమనంగా, ఏ ఒక్కరు కూడా తిండి లేకుండా పస్తులు ఉండకూడదు అన్న ఉద్దేశంతో నిత్యావసరాలను డబ్బును ఇస్తుంది.
తాజాగా నిన్న రాత్రి జగన్ మోహన్ రెడ్డిగారు కూడా ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. బీపీఎల్ కుటుంబాలకన్నిటికి 1000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాకుండా వెంటనే 1300 కోట్ల రూపాయలను ఇందుకోసమని విడుదల చేస్తూ జీవోను కూడా జారీ చేసారు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. తాజాగా కరోనా కేసుల సంఖ్య 149 కి చేరుకుంది. ఇన్నేసి కేసులు పెరగడానికి ఢిల్లీ నిజాముద్దీన్ లో ప్రారతనాలకు హాజరయి వచినవారేనని ప్రభుత్వం చెబుతోంది.
ఇప్పటికే అక్కడ ప్రార్థనలకు హాజరయినవారికోసం ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీవ్రమైన ప్రయత్నాలను చేస్తున్న విషయం తెలిసిందే. అత్యధిక మందిని పట్టుకొని ఐసొలేషన్ కేంద్రాలకు కూడా తరలించారు.
ఇకపోతే... లాక్ డౌన్ ను పొడిగిస్తారా అనే చర్చ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాగుతోంది. కానీ ఆ ఊహాగానాలన్నిటికి తెరదించుతూ, ఈ విషయమై ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ముఖ్యమంత్రులతో మాట్లాడారు.
దేశంలో లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాన్ని దశలవారీగా ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇదిలావుంటే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. లాక్ డౌన్ ఎత్తివేత సందర్బంగా ప్రజలు ఒకేసారి పెద్ద యెత్తున బయటకు రాకుండా చూడాలని ప్రధాని సూచించారు. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత ఎదురయ్యే పరిస్థితుల గురించి ఆయన సీఎంలతో చర్చించారు. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఆయన సూచించారు
డాక్టర్లను, వైద్య సిబ్బందిని పెంచుకోవాలని ఆయన సీఎంలకు సూచించారు. ప్రతి జిల్లాలో నిఘా అధికారులను నియమించాలని ఆనయ చెప్పారు. లాక్ డౌన్ తర్వాత మునుపటిలాగా సాధారణంగా ఉండడానికి లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. హాట్ స్పాట్స్ ను గురించి, వాటిని చుట్టుముట్టాలని ఆయన చెప్పారు.