చిన్న పిల్లల ముడ్డికి తప్ప... కరోనా వార్డులకూ వైసిపి రంగులా..: బుద్దా ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Apr 04, 2020, 12:30 PM ISTUpdated : Apr 04, 2020, 12:32 PM IST
చిన్న పిల్లల ముడ్డికి తప్ప... కరోనా వార్డులకూ వైసిపి రంగులా..: బుద్దా ఫైర్

సారాంశం

కరోనా మహమ్మారి రాష్ట్రంలో విజృంభిస్తున్నా పట్టించుకోకుండా వైసిపి సర్కార్ ప్రచారం కోసం ప్రయత్నిస్తోందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. 

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పబ్లిసిటీ పీక్స్ కు చేరుకుందని టిడిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ద్వజమెత్తారు. అలాంటి పార్టీకి అధ్యక్షుడిగా వున్న వైఎస్ జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలు టిడిపి అధ్యక్షులు చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదని అన్నారు. 

''చిన్న పిల్లల ముడ్డికి తప్ప అన్నింటికీ వైకాపా రంగులు వేసిన వైఎస్ జగన్ గారు, ఎంపీ విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు గారి పబ్లిసిటీ గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది'' అని ఎద్దేవా చేశారు. 

''కరోనా వచ్చి ప్రజలు అల్లాడుతుంటే కోట్లు వృధా చేసిన న్యూయార్క్ టైం స్క్వేర్ లో కరోనా ని ఎదుర్కున్న ధీరుడు అని జగన్ గారు ప్రకటనలా,ప్రజల్ని రేషన్ కోసం రోడ్ల మీద నిలబెట్టారు అని బ్రిటన్ లాంటి దేశాలు జగన్ గారి వాలంటీర్ వ్యవస్థని ఆదర్శంగా తీసుకున్నాయి అని బ్లూ పత్రికలో వార్తలా?'' అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

''ఆఖరికి కరోనాని ఎదుర్కొవడానికి ఏర్పాటు చేస్తున్న ఎమర్జెన్సీ వార్డులకు వైకాపా ఎమ్మెల్యేలు రిబ్బన్ కట్టింగ్లా. ఆఖరికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ల పై కూడా జగన్ బొమ్మ వేసుకున్నారు'' అని మండిపడ్డారు. 

''పైగా అబ్బబ్బే మా పార్టీకి పబ్లిసిటీ పిచ్చ అస్సలు లేదండి అని బిల్డ్ అప్ లా. పబ్లిసిటీ కే రోత పుట్టేలా ఉంటుంది జగన్ గారి పబ్లిసిటీ పిచ్చ'' అంటూ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి రూ.41.50లక్షల సాయం...
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చేతికర్ర: టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి