బాలయ్య నియోజకవర్గంలో వెరైటీ లాక్ డౌన్.. మాట వినకుంటే అంతే..

By telugu news teamFirst Published Apr 4, 2020, 12:26 PM IST
Highlights

అనంతపురం జిల్లా లేపాక్షిలో పదేళ్ల బాలుడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్థానికంగా ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. కొందరు భయంతో బయటకు రాకుండా ఉన్నప్పటికీ కొందరు మాత్రం కావాలనే బయట తిరగడం మొదలుపెట్టారు.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే... అధికారులు ప్రజల క్షేమం కోసం లాక్ డౌన్ ప్రకటించినా... కొందరు ఆకతాయిలు ఊరికే ఉండటం లేదు. వద్దని హెచ్చరించినా.. బయట తిరుగుతూ నానా రచ్చ చేస్తున్నారు.

Also Read ఏపీని వణికిస్తున్న కరోనా: 180కి చేరిన కేసులు, జిల్లాలవారీ లెక్కలు ఇవీ......

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో కాస్త వెరైటీ లాక్ డౌన్ విధించారు. వద్దని ఎంత మొత్తుకున్నా ప్రజలు వినకుండా బయటకు తిరుగుతున్నారని ఏకంగా ఇళ్లకు తాళాలు వేశారు. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అనంతపురం జిల్లా లేపాక్షిలో పదేళ్ల బాలుడికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో స్థానికంగా ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. కొందరు భయంతో బయటకు రాకుండా ఉన్నప్పటికీ కొందరు మాత్రం కావాలనే బయట తిరగడం మొదలుపెట్టారు.

అంతే... అధికారులు కొత్త పంథా మొదలుపెట్టారు. నియోజకవర్గంలోని అందరి ఇళ్లకు తాళాలు వేశారు. కేవలం ఉదయం, సాయంత్రం తాగునీరు, పాలు, ఇతర నిత్యావసరాలు అవసరమైనవారికి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

లేపాక్షిలో ఎవరైన నిబంధనలను అతిక్రమించి వీధుల్లోకి వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు చిలమత్తూరులోనూ ఇలాగే ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. జనాలు నిబంధనల్ని పట్టించుకోవడం లేదని.. వైరస్ వ్యాప్తి ఉందని చెప్పినా వినడం లేదని.. అందుకే ఇలా తాళాలు వేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు

click me!