అందుకోసమే నా అరెస్ట్... న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: నిమ్మల రామానాయుడు

By Arun Kumar P  |  First Published Apr 7, 2020, 10:30 AM IST

ఆక్వా, వరి రైతుల కోసం పాలకొల్లు నుండి ఏలూరుకు సైకిల్ యాత్ర చేపట్టిన టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.దీనిపై ఆయన తాజాగా స్పందిస్తూ వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. 


తెలుగుదేశం పార్ట ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్రను పోలీసులు భీమవరంలో అడ్డుకున్నారు. లాక్‌డౌన్ జరిగే సమయంలోసైకిల్ యాత్ర చేయకూడదనిపేర్కొంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పాలకొల్లు నుంచి ఏలూరుకు సైకిల్‌పై వెళుతుండగా భీమవరం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఆయన యాత్రకు బ్రేక్ పడింది. 

సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎమ్మెల్యే రామానాయుడు తీవ్రంగా స్పందించారు. అసలు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్య‌ ప్రభుత్వం పనిచేస్తోందా లేక  జ‌గ‌న్ స్వామ్య‌మా?అని ప్రశ్నించారు. రైతుల‌ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలని కోరితే అరెస్టులు చేస్తారా అని నిలదీశారు. 

Latest Videos

సైకిల్‌పై క‌లెక్ట‌ర్‌ని క‌ల‌వ‌డానికి వెళితే నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఆక్వా రైతుల స‌మ‌స్య‌ల‌పై భీమవరంలో క‌లెక్ట‌ర్ ఏర్పాటు చేసిన స‌మీక్ష స‌మావేశానికి మంత్రులు, సబ్ కలెక్టర్, మత్స్యశాఖ అధికారులతో పాటు నర్సాపురం, భీమవరం ఎమ్మెల్యేలు, పాలకొల్లు వైసిపి నాయకులను కూడా ఆహ్వానించారని... కానీకి ఎమ్మెల్యే అయిన తనను ప్రోటోకాల్ ప్ర‌కారం పిలవకుండా ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను అప‌హాస్యం చేశారని మండిపడ్డారు.

కరోనా నిబంధనలు వైకాపా ఎమ్మెల్యేలకు ఉండవా? అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి వైకాపా నేత‌ల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీ వ్య‌వ‌హ‌రించ‌డం త‌గునా? అని అన్నారు. ఆక్వా,వరి రైతుల‌కు న్యాయం చేయాల‌ని చెప్పడానికి ఫోన్‌చేస్తే స్పందించ‌ని క‌లెక్ట‌ర్‌, ఎస్పీలపై చ‌ర్య‌లు తీసుకోవాలి డిమాండ్ చేశారు.

ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ వైకాపా కోస‌మే ప‌నిచేస్తున్న అధికారుల‌పై చ‌ర్యలు తీసుకోక‌పోయినా...ఆక్వా, వరి రైతుల‌ను ఆదుకోక‌పోయినా న్యాయం కోసం న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తానని ఎమ్మెల్యే రామానాయుడు వైసిపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

రామానాయుడు గతంలో కూడా వివిధ సమస్యలపై సైకిల్ యాత్ర చేశారు. అంతేకాదు లాక్‌డౌన్, కరోనా వేళ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాలకొల్లులో సైకిల్‌పై తిరిగారు. జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కోరారు.. అలాగే నిత్యావసరాలు, కూరగాయల ధరలపై ఆరా తీశారు. అంతేకాదు మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలో శానిటేషన్‌లో పాల్గొన్నారు.


 

click me!