చిన్నారి పెద్ద మనసు: సైకిల్ కోసం దాచుకున్న డబ్బు... సీఎం రిలీఫ్ ఫండ్‌కు (వీడియో)

By Siva KodatiFirst Published Apr 6, 2020, 11:34 PM IST
Highlights

కరోనా కట్టడిలో భాగంగా పలువురు ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి తన కిడ్డీ బ్యాంక్‌ను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చాడు

కరోనా కట్టడిలో భాగంగా పలువురు ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి తన కిడ్డీ బ్యాంక్‌ను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చాడు.

Also Read:కరోనా విజృంభిస్తున్నా అలా చేయడం ఎన్నికల ఉల్లంఘనే... చర్యలు తప్పవు: ఏపి ఈసీ

వివరాల్లోకి వెళితే..  విజయవాడకు చెందిన నాలుగేళ్ల చిన్నారి హేమంత్ తను సైకిల్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులను కరోనాపై పోరాటం చేస్తున్న జగన్‌కు ఇవ్వాలని తల్లిదండ్రులను కోరాడు.

దీంతో వాళ్లు హేమంత్‌ను మంత్రి పేర్ని నాని వద్దకు తీసుకెళ్లారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ మొత్తాన్ని మంత్రికి అందజేశాడు. ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపించాలని బాలుడు హేమంత్‌.. మంత్రిని కోరాడు.

Also Read:అంతర్జాతీయ తీవ్రవాదికి బాబుకు తేడా లేదు: పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు

తనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమని, అందుకే తాను దాచుకున్న డబ్బులు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు బాలుడు.. మంత్రికి చెప్పాడు. చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న హేమంత్‌ను మంత్రి నాని అభినందించారు. అంతేకాకుండా చిన్నారి కొనుక్కోవాలనుకున్న సైకిల్‌ను తాను కొనిస్తానని బాబుకు కొనిస్తానని హామీ ఇచ్చారు. 

 

"

click me!