విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు: ఏపీలో 12కు పెరిగిన సంఖ్య

By telugu team  |  First Published Mar 27, 2020, 12:09 PM IST

విశాఖపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో విశాఖలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరుకుంది.


విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసుతో విశాఖపట్నంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 3కు చేరుకుంది.

బర్మింగ్ హామ్ నుంచి వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ లోకి వచ్చిన వ్యక్తికి విశాఖపట్నంలో తాజాగా కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకు 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 317 మందికి కరోనా లేదని తేలింది. మరో 55 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. 

Latest Videos

Also Read: కరోనా భయం: రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య, సూసైడ్ నోట్

గురువారంనాడు విజయవాడలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. 28 ఏళ్ల యువకుడికి కోరనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ఈ నెల 18వ తేదీన స్వీడన్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. అక్కడి నుంచి విజయవాడకు చేరుకున్నాడు. అతను జీజీహెచ్ లో చేరాడు. దీంతో విజయవాడలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3కు చేరుకుంది. 

బుధవారంనాడు వాషింగ్టన్ నుంచి వచ్చిన 21 ఏళ్ల యువకుడి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. గుంటూరు ఓ కేసు బయటడింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.

click me!