లాక్‌డౌన్ ఎఫెక్ట్: తిరుమలలో ఏప్రిల్ 14 వరకు దర్శనాల నిలిపివేత

By Siva KodatiFirst Published Mar 30, 2020, 5:38 PM IST
Highlights

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రారంభించే నాటికే ప్రధానమైన ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను అధికారులు మూసివేశారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రారంభించే నాటికే ప్రధానమైన ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను అధికారులు మూసివేశారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు.

మరోవైపు కనుమ రహదారులను దేవస్థానం అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు టీటీడీ సిబ్బంది తిరుమలలో వారం రోజుల పాటు షిఫ్ట్ పద్ధతిలో విధులు నిర్వహించనున్నారు.

Also Read:జనసంచారం లేకపోవటంతో... తిరుమల కొండపై పులుల సంచారం

ఏప్రిల్ 2న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించాల్సిన శ్రీవారి హనుమంత సేవ కూడాను టీటీడీ రద్దు చేసింది. తిరుపతి నగరంలో 50 వేల మందికి దేవస్థానం తరుపున ఆహార పంపిణీ చేస్తున్నారు.

ఇక స్వామి వారి వార్షిక వసంతోత్సవాలను కూడా కల్యాణ మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించింది. వైరస్ వ్యాప్తి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయి తిండిలేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను టీటీడీ ముందుకొచ్చింది.

Also Read:కరోనా దెబ్బ: ఇక ఫ్రీ గా తిరుమల వెంకన్న ప్రసాదం

రోజుకు రెండు పూటలా వివిధ ఆహార పదార్థాలను తిరుపతి నగరంలోని పలు కాలనీల్లో పంపిణీ చేస్తోంది. మధ్యాహ్నం 35 వేలు, రాత్రి 15 వేల ఆహార పొట్లాలను అందజేస్తోంది. పెరుగన్నం, సాంబారన్నం, పులిహోర, టమాటో రైస్‌తో పాటు గోధుమ రవ్వతో కూడిన ఉప్మాను తయారు చేసి పేదలకు ఉచితంగా అందజేస్తోంది.

తిరుపతి నగరంలోని 50 వార్డుల్లో, 50 వాహనాలను ఏర్పాటు చేసి ఆహారాన్ని సరఫరా చేస్తోంది. మరోవైపు తిరుమలలో భక్తుల సందడి లేకపోవడంతో వన్య మృగాలు సంచరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

click me!