ఏపీని వణికిస్తున్న కరోనా: 180కి చేరిన కేసులు, జిల్లాలవారీ లెక్కలు ఇవీ...

By telugu teamFirst Published Apr 4, 2020, 11:47 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంటగంటకూ కరోనా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మరో 16 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 180కి చేరుకుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. తాజాగా ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది. కర్నూలు జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా కేంద్రం, బనగానపల్లి, అవుకుల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. 

కరోనా వైరస్ పాజిటివ్ కేసులపై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 10.30 నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు కొత్తగా కృష్ణా జిల్లాలో 4, కడప జిల్ాలలో 4, గుంటూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. కొత్తగా నమోదైన ఈ 16 కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది.

Also Read: విశాఖలో కరోనా కలకలం... ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్

నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం కృష్ణా జిల్లా ఆక్రమిస్తోంది. కృష్ణా జిల్లాలో 27 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకైతే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వ్యాధికి గురైనవారిలో ఎక్కువ మంది ఢిల్లీలో జరిగన మతప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారే కావడం గమనార్హం. వారిని గుర్తించి, వారినీ వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ కు పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Also Read: రాజమండ్రిలో మరో రెండు కొత్త కరోనా కేసులు: ఏపీలో 164కు చేరిన సంఖ్య

జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 2
చిత్తూరు 10
తూర్పు గోదావరి 11
గుంటూరు 23
కడప 23
కృష్ణా 27
కర్నూలు 4
నెల్లూరు 32
ప్రకాశం 18
విశాకపట్నం 15
పశ్చిమ గోదావరి 15

 

ఏపీలో 180కి చేరిన కరోనా కేసుల సంఖ్య pic.twitter.com/xSiUXtvzDA

— Asianet News Telugu (@asianet_telugu)
click me!