ప్రకాశం జిల్లాలో మరో రెండు కేసులు: ఏపీలో 113కు పెరిగిన సంఖ్య

By telugu teamFirst Published Apr 2, 2020, 10:23 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది. ఏపీలో ఆ సంఖ్య 113కు చేరుకుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది. చీరాల నుంచి నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వృద్ధుడి భార్యకు, కుమారుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రకాశం జిల్లాలోని 17 కేసుల్లో 14 కేసులు నిజాముద్దీన్ వెళ్లి వచ్చినవారికి సంబంధించినవే కావడం విశేషం.

ప్రకాశం జిల్లాలోని రెండు తాజా కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 113కు చేరుకుంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి. కృష్ణా, కడప జిల్లాల్లో 15 కేసుల చొప్పున రికార్డయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విశాఖపట్నం జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో రెండు, చిత్తూరు జిల్లాలో 6, తూర్పు గోదావరి జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో ఒక్క కేసు, నెల్లూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

Also Read: ఏపీలో కరోనా విలయతాండవం: ఒక్కరోజే 67 కేసులు, మొత్తం 111

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ఒక్కటేసి కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. అయితే, నమూనాలను పరీక్షలకు పంపించారు. ఈ రెండు నిర్ధారణ అయితే చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 8కి చేరుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఒక్క రోజే 67 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 111 కేసులు రికార్డయ్యాయి. తాజాగా రెండు కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య 113కు చేరుకుంది. 

click me!