కరోనా దెబ్బ: పాజిటివ్ కేసు నమోదు, మంగళగిరిలో రెడ్ జోన్

By telugu teamFirst Published Apr 2, 2020, 11:56 AM IST
Highlights

మంగళగిరిలో రెడ్ జోన్ ప్రకటించినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ హేమమాలిని చెప్పారు. గత రాత్రి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతనితోపాటు అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు.

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గత అర్థరాత్రి 65 ఏళ్ల వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ హేమమాలిని తెలిపారు ఈ వ్యక్తి ఇటీవల ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. 

అతనితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. పట్టణంలోని టిప్పర్ల బజారులో ఉన్న కరోనా బాధితుడి నివాసం నుంచి 3 కిలో మీటరల్ పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించినట్లు హేమమాలిని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసుతో సమీపంలోని దుకాణాలను, కూరగాయల మార్కెట్లను మూసివేయించినట్లు చెప్పారు. 

Also Read: ఏపీపై కరోనా దెబ్బ: మరో 21 కొత్త కేసులు, 132కి చేరిక కేసులు

ఆ ప్రాంతంలో 144వ సెక్షన్ విధించి ఎవరినీ ఇళ్లలోంచి బయటకు రానివ్వడం లేదని, ఆ ప్రాంతమంతా హైఅలర్ట్ ప్రకటించామని ఆమె తెలిపారు. 

కాగా,  ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 20 కేసులు తేలాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమాంతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132కు చేరుకుంది. విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారు ఇందులో ఉన్నారు 

click me!