విజయవాడపై కోరలుచాస్తున్న కరోనా...ఎనిమిది రెడ్ జోన్లు ఏర్పాటు

By Arun Kumar P  |  First Published Apr 6, 2020, 7:22 PM IST

కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారిన ఇప్పటివరకు 28మంది మృత్యువాతపడ్డారు. 


విజయవాడ: కరోనా మహమ్మారి ఆంధ్ర ప్రదేశ్ పై కోరలు చాస్తోంది. రోజురోజుకు ఈ వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 303మందికి ఈవైరస్ సోకింది. ఒక్క కృష్ణాజిల్లాలోనే మొత్తం 28 మందికి కరోనా సోకినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. 

ఒక్క విజయవాడ నగరంలోనే అత్యధికంగా 23 కరోనా పాజిటివ్ కేసులు  నమోదయినట్లు తెలిపారు. దీంతో జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ లో చికిత్స అందిస్తున్నట్లు... అధికారులంతా ఆప్రమత్తంగా వున్నారని కలెక్టర్ వెల్లడించారు. 

Latest Videos

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నివాస ప్రాంతాలలో పాటు సిటీలో మొత్తం ఎనిమిది రెడ్ జోన్లు... జగ్గయ్యపేట, నూజివీడు, మచిలీపట్నం లో కంటెయిన్ మెంట్ జోన్ లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

జిల్లాలోని ప్రధాన నగరాల వీధి వీధిలో పారిశుధ్యంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్లు తెలిపారు. వీఎంసి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో నాలుగువందల బెడ్స్ తో రాష్ట్ర కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పిన్నమనేని సిద్దార్థ లో 132 బెడ్స్ తో క్రిష్ణా జిల్లా కోవిడ్ సెంటర్, పదహారు నియోజక వర్గాల్లో 100 బెడ్లతో పదహారు క్వారెంటైన్ సెంటర్ల ఏర్పాటు చేశామన్నారు. 

విజయవాడలో అదనంగా మూడు  క్వారెంటైన్ సెంటర్ల ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మూడు అంబులెన్సులకు అదనంగా మరో మూడు ఏర్పాటు చేశామన్నారు.  విదేశాల నుంచి వచ్చి విజయవాడలో ఉన్న వారి క్వారెంటైన్ పరిశీలించేందుకు రంగంలోకి 100 మంది హౌస్ సర్జన్లను నియమించిన్లు తెలిపారు.

క్వారెంటైన్ కోసం బెడ్లు కేటాయించేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు  ముందుకొస్తున్నాయని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు. 


 


 

click me!