అంతర్జాతీయ తీవ్రవాదికి బాబుకు తేడా లేదు: పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Apr 6, 2020, 3:49 PM IST
Highlights

అంతర్జాతీయ తీవ్రవాది మనస్తత్వానికి చంద్రబాబుకు ఏ మాత్రం తేడా లేదని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
సోమవారం నాడు ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
 

అమరావతి:అంతర్జాతీయ తీవ్రవాది మనస్తత్వానికి చంద్రబాబుకు ఏ మాత్రం తేడా లేదని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
సోమవారం నాడు ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

 కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నా కూడ రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరంగా చంద్రబాబు నిందలు వేస్తున్నారన్నారు.కష్టసమయంలో చంద్రబాబునాయుడు దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కిష్ట సమయంలో కూడ రాజకీయాలు చేయడం సరైందా అని ఆయన ప్రశ్నించారు. 

 పక్క రాష్ట్రంలో కూర్చొని సీఎం జగన్ పై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.కరోనాపై తప్పుడు లెక్కలు చెబుతున్నామని చంద్రబాబు చెప్పడం  సిగ్గు చేటన్నారు.ఈ వ్యాధి ప్రబలిపోతే మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఎందుకు సోకలేదని ఆయన ప్రశ్నించారు. లెక్కకు మించి కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారని చంద్రబాబు మాట్లాడడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. 

also read:కరోనాపై వాస్తవాలను ప్రజలకు చెప్పాలి: ఏపీ ప్రభుత్వానికి బాబు డిమాండ్

రెడ్ జోన్ లో కూడ ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు 24 గంటల పాటు పనిచేస్తున్నారన్నారు.  ఈ సమయంలో చంద్రబాబునాయుడు చేసిన విమర్శలు ఈ సేవల్లో పాల్గొన్న వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా  చంద్రబాబు మాట్లాడారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. 

ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సుమారు 20 వేల క్వారంటైన్ బెడ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. 
రాష్ట్రానికి వచ్చిన 28 వేల ఎన్ఆర్ఐల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు మంత్రి.
 

click me!