గుంటూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

By telugu team  |  First Published Mar 25, 2020, 2:48 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో తొలి కరోనా వైరస్ నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన అతను హోం క్వారంటైన్ కాకుిండా ఇష్టం వచ్చినట్లు తిరిగాడు. 500 మందికి విందు కూడా ఇచ్చాడు.


గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు  జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన తరువాత అతను ఎక్కడపడితే అక్కడ తిరిగాడు.అతను 500 మందికి విందు కూడా ఇచ్చాడు. 

రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలు ఉన్నట్లు బయటపడింది.  నమూనాలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలకు పంపించారు. అప్రమత్తమైన ప్రభుత్వ అదికారులు  మంగళదాస్ నగర్ లో ఇంటింటి సర్వే చేపట్టారు.

Latest Videos

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. తాజాగా చిత్తూరు జిల్లా కాళహస్తిలో ఓ కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి చేరుకుంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 

ఆ యువకుడు శ్రీకాళహస్తికే చెందిన మిత్రుడితో కలిసి లండన్ లో ఎంసీఏ చదువుతున్నాడు. ఇద్దరు కలిసి ఈ నెల 18వ తేదీ రాత్రి లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీ మధ్యాహ్నం చెన్నైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి కారులో శ్రీకాళహస్తి వచ్చాడు. 

దగ్గు, జ్వరం, జలుబు ఉండడంతో ఈ నెల 23వ తేదీన తిరుపతి రుయా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. అతని నమూనాలను సేకరించి స్విమ్స్ లో పరీక్షించారు. దాంతో అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. విశాఖలో ఇటీవల పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూతురు నమూనాలను కూడా పరీక్షించారు. ఆమెకు నెగెటివ్ వచ్చిందని వైద్యులు తేల్చారు. 

click me!