వైద్యులపై దాడులా.. వైఎస్ చేసిన చట్టాన్ని అమలు చేయండి: ఇరు రాష్ట్రాలకు కేవీపీ సలహా

By Siva KodatiFirst Published Apr 3, 2020, 9:58 PM IST
Highlights

తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనా వైరస్ రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు

దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందిపై దాడులు, దురుసు ప్రవర్తనతో సభ్య సమాజం తలదించుకుంటోంది. ఈ క్రమంలో తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి కరోనా వైరస్ రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు.

Also Read:జగన్ కొరడా: ప్రభుత్వ, ప్రైవేట్ సర్వీసులపై ఎస్మా ప్రయోగం

ఇదే సమయంలో వైద్యులకు భద్రతను ఇచ్చేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సలహా ఇచ్చారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై దాడులకు వ్యతిరేకంగా దేశంలోనే తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2007లో చట్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చేసిన చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని కేవీపీ కోరారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రామచంద్రరావు డిమాండ్ చేశారు.

Also Read:ఏపీలో కోరలు చాస్తున్న కరోనా: సీఎం జగన్‌కు బాబు లేఖ, కీలక సూచనలు

సంక్షోభం సమయంలో అందరి క్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలను, విధించే ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కేవీపీ కోరారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు కష్టాల్లో ఉన్న వారికి కాంగ్రెస్ కార్యకర్తలు సాయం అందించాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. 

click me!