ప్రాణాలతో చెలగాటం: అర్థరాత్రి 70 మంది కూలీలతో రొయ్యలు వొలిపించిన వైనం

By telugu teamFirst Published Mar 26, 2020, 9:04 AM IST
Highlights

అర్థరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా పొలాల్లో 70 మంది కూలీలతో అధికారులు రొయ్యలను వొలిపించారు. టీడీపీ నేత వాటర్ ట్యాంకర్ ను దీనికి వాడారు. సమాచారం ఇచ్చినా పోలీసులు చర్యలు తీసుకోలేదు.

అమరావతి: అధికారులు 70 కూలీల ఆరోగ్యంతో చెలగాటమాడారు. అర్థరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా 70 మంది కూలీలతో రొయ్యలను వొలిపించారు. ఎవరు కూడా గుమికూడదనే ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు ఆ పనిచేశారు. పోలీసుుల, రెవెన్యూ శాఖ అధికారులు నిర్వాహకుడితో కలిసి ఆ పనిచేశారు. 

పామర్రు వద్ద నిమ్మలూరు పొలాల్లో అర్థరాత్రి ఆ పనికి ఒడిగట్టారు. నలుగురి కన్నా ఎక్కువగా నిలబడితే కరోనా వస్తుందని చితకబాదే పోలీసులకు తెలిసే జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు కంటైనర్ల రొయ్యలను 70 మంది కూలీలు వొలిచే పనిలో పడ్డారు. ఓ టీడీపీ నేత వాటర్ ట్యాంకర్ ను ఈ పనికి వాడారు. 

కాగా, కృష్ణా జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారని ఎస్పై గణేష్ చెబుతున్నారు. అనుమతులు ఉంటే రాత్రి వేళల్లో పనులు చేయాల్సిన అవసరమేమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. మచిలీపట్నానికి చెందన ఓ వ్యక్తి అర్థరాత్రి 70 మంది కూలీలను చేరవేసినట్లు తెలుస్తోంది. పగలు మాత్రమే కరోనా వ్యాపిస్తుందా, రాత్రి వేళ వ్యాపించదా అనేది ప్రశ్న. 

ఆ విషయంపై సమాచారం ఇచ్చినా కూడా సీఐ గానీ ఎస్సైలు గానీ స్పందించలేదు. సమాచారం ఇచ్చిన వ్యక్తిని పోలీసులు బెదిరిస్తున్నట్లు మాట్లాడారు. 100కు సమాచారం ఇచ్చిన తర్వాత 30 నిమిషాలకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం ఇచ్చిన కొడాలి రాజేష్ వారితో కరోనాపై గట్టిగా వాదించాడు. దాంతో అక్కడి నుంచి మహిళా కూలీలు పారిపోయారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. తాజాగా గుంటూరు, విజయవాడల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ నుంచి విజయవాడ వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు.

click me!