తరిమేసిన ఏపీ పోలీసులు, ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వం

By Sree sFirst Published Mar 26, 2020, 9:39 PM IST
Highlights

తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కి పోవడానికి చాలామందికి పాసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని అనుమతించలేదు. తాజాగా నేటి ఉదయం కూడా చాలా మంది ఆ పాసులను తీసుకొని బయల్దేరారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యేందుకు వేచి ఉన్నారు. 

వాడపల్లి: కరోనా వైరస్ వల్ల దేశమంతా లాక్ డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే! అన్ని రాష్ట్రాలు కూడా వారి బోర్డర్లను మూసేసారు. సరిహద్దుల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసారు. 

నిన్న తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కి పోవడానికి చాలామందికి పాసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని అనుమతించలేదు. తాజాగా నేటి ఉదయం కూడా చాలా మంది ఆ పాసులను తీసుకొని బయల్దేరారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యేందుకు వేచి ఉన్నారు. 

అయినప్పటికీ... వారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం అనుమతించలేదు. ఉదయం నుంచి వారు పోలీసులను వేడుకుంటూనే ఉన్నారు. చాలా మంది మహిళలు చంటి పిల్లలతో కూడా ఉన్నారు. వారికి అక్కడ చుక్క మంచినీరు కూడా దొరకడం లేదు. 

ఇలా ఉండగా సాయంత్రానికి కూడా చీకటిపడుతున్నా పోలీసులు మాత్రం కనికరించలేదు. అసహనంలో తోపులాట జరిగింది. ఆ తరువాత రాళ్లు రువ్వారు ప్రజలు. పోలీసులు సైతం తీవ్రంగా లాఠీ ఛార్జ్ చేసారు. ఎటుపోవాలో అర్థం కానీ ప్రజలు భయంతో బిక్కు బిక్కుమనుకుంటు తెలంగాణ వైపుగా వస్తే... తెలంగాణ పోలీసులు వారిని వారి వద్దకు తీసుకొని తెలంగాణ సరిహద్దు వైపు కూర్చోబెట్టారు. 

ప్రస్తుతానికి ఆంధ్ర అధికారులతో మాట్లాడుతాము అని అంటున్నారు. ఆ తరువాత ఏమవుతుందో అని అంతా టెన్షన్ పడుతున్నారు. ఆడవారు మగవారు అని లేకుండా అందరిపై లాఠీలు ఝులిపించారు పోలీసులు. 

లాక్ డౌన్ ను దృష్టిలో పెట్టుకుని కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో మాట్లాడానని, ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు. సరిహద్దులో చిక్కుకుపోయినవారిని చూసి, నిన్నటి సంఘటనలు చూసి తన మనసు చలించిపోయిందని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. తాజాగా గుంటూరు, విజయవాడల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ నుంచి విజయవాడ వచ్చిన 21 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు.

మరో వైపు, గుంటూరు జిల్లాలో ఓ కరోనా కేసు బయటపడింది. ప్రత్యేక ప్రార్థనల్లో పొల్గొని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ రెండు కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదికి చేరుకుంది. 

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. లండన్ లో ఎంసిఏ చదువుతున్న ఆ యువకుడు ఈ నెల 18వ తేదీన లండన్ నుంచి బయలుదేరి 19వ తేదీన శ్రీకాళహస్తి చేరుకున్నాడు. 

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

click me!