దాచేపల్లి ఘర్షణ: ఏపీ డీజీపి గౌతమ్ సవాంగ్ రియాక్షన్ ఇదీ...

By telugu teamFirst Published Mar 27, 2020, 8:04 AM IST
Highlights

పోలీసులకు, ఏపీ వాసులకు గుంటూరు జిల్లా దాచేపల్లి చెక్ పోస్టు వద్ద జరిగిన ఘర్షణపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఏపీలోకి రావడానికి ప్రయత్నించడం వల్లనే ఆ సంఘటన చోటు చేసుకుందని ఆయన అన్నారు.

మహబూబ్ నగర్: గుంటూరు జిల్లా  దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఘటనను ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్  దురదృష్టకరమైందిగా అభివర్ణించారు. దాచేపల్లి పొందుగుల చెక్ పోస్టు వద్ద తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని తమ గ్రామాలకు వెళ్లడానికి వేచి ఉన్న ప్రజలు పోలీసులతో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. వారిని ఏపీలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేశమంతటా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అమలులో ఉన్న ఈ సమయాన ఇట్టువంట్టి అవాంఛనీయ చర్యలకు పాల్పడడం గర్హనీయమని ఆయయన అన్నారు. 

ఒక దేశం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న   ఈ సందర్భంలో భాద్యతయుత   పౌరుడుగా వ్యవహరించడం మన కర్త్యవమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మరచి ఈ విధమైన చర్యలకు పాల్పడడం ఎంత వరకు సమంజసమో మీరే నిర్ణయంచుకోవాలని ఆయన అన్నారు. 

See Video: తరిమేసిన ఏపీ పోలీసులు, ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వం

మెడికల్ ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకారం తన కోసం తన కుటుంబ సభ్యుల కోసం  దేశ పౌరుల కోసం స్వీయ నిర్భంధం లో ఉండాలని ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రాల  మధ్య సరిహద్దులను మూసేసినట్లు తెలిపారు. జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని, గ్రామాలకు గ్రామాలు స్వచ్చందంగా స్వీయ నిర్బంధంలో వెళ్లిపోయాయని ఆయన చెప్పారు. 

ఇది ఇలా ఉండగా అన్ని జిల్లా సరిహద్దులను చేదించుకొని చట్టాలను ఉల్లంఘించి, బైకులు, కార్లు, బస్సులలో వచ్చి అన్ని ప్రొటోకాల్సును ఉల్లంఘించి పొందుగుల సరిహద్దు వద్ద చొచ్చుకు వచ్చారని ఆయన చెప్పారు. మానవతా దృక్పథంతో రెండు ప్రభుత్వాలు చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రోటోకాల్ ప్రకారం వారి ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకొని మెడికల్ పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలోకి అనుమతించేలాగా రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. 

అందులో భాగంగా  వారి  కోసం బస్సులు సమకూర్చామని, క్వారంటిన్ ఏర్పాటు చేశామని, ఇవే మీ పట్టించుకోకుండా   వారు బోర్డర్ దాటడానికి ప్రయత్నించారని ఆయన చెప్పారు. చీకటి పడిన తరువాత పోలీసులపై కి మూకుమ్మడి దాడులు జరిపి పోలీసులను తీవ్రంగా గాయపరిచారని అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అట్టి వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరిపి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి

హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు అక్కడే ఉండాలని అభ్యర్దిస్తున్నట్లు గౌతమ్ సవాంగ్ చెప్పారు. అట్టి వారికి ఇరు ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చల మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కలిగించే లాగా హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి మనలను కాపాడుకోవడానికి, కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి, మన దేశాన్ని కాపాడుకోవడానికి  కంకణబద్దులమై ముందుకు కదులుదామని, దేశ భక్తి ని ప్రదర్శిద్దామని ఆయన అన్నారు.

click me!