మారుతి సుజుకి, టాటా కార్లకు పోటీగా సరికొత్త జనరేషన్ హ్యుందాయ్‌ ఐ20.. బుకింగ్స్ కూడా ఓపెన్..

Ashok Kumar   | Asianet News
Published : Oct 28, 2020, 12:16 PM IST
మారుతి సుజుకి, టాటా కార్లకు పోటీగా సరికొత్త జనరేషన్ హ్యుందాయ్‌ ఐ20.. బుకింగ్స్ కూడా ఓపెన్..

సారాంశం

పండుగ సీజన్ లో కొత్త హ్యుందాయ్ ఐ20 నవంబర్ 5న లాంచ్ అవుతుంది. ఈ ఏడాది మార్చిలో జెనీవా మోటార్ షోలో కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించాల్సి ఉంది, అయితే, కోవిడ్-19 కారణంగా, ఈ కార్యక్రమం జరగలేదు.  

 కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్స్‌ భారతదేశంలో కొత్త హ్యుందాయ్ ఐ20 బుకింగ్స్ ప్రారంభించింది. ఆల్‌-న్యూ ఐ20  మోడల్‌ కోసం  కస్టమర్లు రూ.21,000 బుకింగ్‌ అడ్వాన్స్‌ చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. 

 పండుగ సీజన్ లో కొత్త హ్యుందాయ్ ఐ20 నవంబర్ 5న లాంచ్ అవుతుంది. ఈ ఏడాది మార్చిలో జెనీవా మోటార్ షోలో కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించాల్సి ఉంది, అయితే, కోవిడ్-19 కారణంగా, ఈ కార్యక్రమం జరగలేదు.

also read ఆంధ్రప్రదేశ్‌లో కైనెటిక్‌ గ్రీన్‌ భారీ పెట్టుబడులు.. లంబోర్గిని భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయా...

కొత్త జనరేషన్ ఐ20 ఫ్రంట్ ఎండ్ వెర్నా తరువాత రూపొందిచారు. హ్యుందాయ్ ఐ20 కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. ఫోర్డ్ ఫియస్టా, ఆడి ఎ1కు కొత్త జనరేషన్ ఐ20 సమానంగా ఉంటుంది.

ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఎస్‌ఎస్‌ మాట్లాడూతూ భారత్‌లో ప్రీమియం హాచ్‌బ్యాక్‌ ప్రమాణాలను మార్చే విధంగా ఈ మోడల్‌లో కొత్త టెక్నాలజీని వినియోగించామన్నారు. ఈ ఆల్‌-న్యూ ఐ20 నవంబర్‌ ఐదున భారత మార్కెట్లో విడుదల అవుతుంది. ఆల్-న్యూ హ్యుందాయ్ ఐ20  ధర 6 లక్షల నుండి 10 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా.

హ్యుందాయ్ ఐ20 లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి,  కొత్త జనరేషన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ధర భారతదేశంలో 6 నుండి 10 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుంది. సరికొత్త హ్యుందాయ్ ఐ20 కార్ మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాంజా, హోండా జాజ్ లతో పోటీ పడనుంది.
 
PREV
click me!

Recommended Stories

కారు అంటే ఇలా ఉండాలి.. రూ. 10 లక్షల లోపే సన్‌రూఫ్, అదిరిపోయే మైలేజ్!
Budget CNG Cars: రూ. 7 ల‌క్ష‌ల నుంచే మొదలు.. బెస్ట్ బ‌డ్జెట్ CNG కార్లు ఇవే. ఫీచ‌ర్లు కూడా అదుర్స్