రహదారి, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదలలో మృతి చెందినవారు మొత్తం 13.5 లక్షల మంది, ఇందులో 11 శాతం రోడ్డు ప్రమాద మరణాలు భారతదేశంలోనే జరిగాయి.
ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల మరణాల విషయానికి వస్తే భారతదేశం టాప్ లో ఉంది. రహదారి, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదలలో మృతి చెందినవారు మొత్తం 13.5 లక్షల మంది, ఇందులో 11 శాతం రోడ్డు ప్రమాద మరణాలు భారతదేశంలోనే జరిగాయి.
మొత్తం మీద 2019లో భారతీయ రోడ్లపై 1,51,113 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇది ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే అత్యధికం. రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో అమెరికా నిలిచింది. 2019లో చైనాలో 63,093 మంది ప్రాణాలు కోల్పోగా, అమెరికాలో 37,461 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.
లక్ష జనాభాకు రోడ్డు ప్రమాద మరణాల విషయానికి వస్తే ఇరాన్, రష్యా, చైనా తరువాత భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది. 2018 సంవత్సరంలో భారతీయ రోడ్లపై మొత్తం 4,67,044 ప్రమాదాలు, 1,51,417 మరణాలు సంభవించాయి, అంటే 2019లో ఈ సంఖ్య 0.20% స్వల్పంగా పడిపోయింది.
also read
1,463 మరణాలతో భారతదేశ రాజధాని ఢిల్లీ మొదటి ర్యాంకును తరువాత జైపూర్, చెన్నై, బెంగళూరు, కాన్పూర్ నిలిచాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల గురించి చెప్పాలంటే 2019లో ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల్లో 22,655 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మొత్తం రోడ్డు ప్రమాదాల మరణాల్లో 15 శాతం.
రెండవ, మూడవ స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘనల్లో 2019లో కూడా అతి వేగం(ఓవర్ స్పీడ్) పెద్ద సంఖ్యలో మరణాలకు దారితీసింది, మరణించిన వారిలో 67 శాతం మంది రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదానికి కారణమయ్యారు, ఇది మొత్తం రోడ్డు ప్రమాదాల మరణాలలో 6 శాతం.
మొత్తం రోడ్డు నెట్‌వర్క్‌లోని జాతీయ రహదారుల పై 35.7 శాతం, రాష్ట్ర రహదారులపై 24.8 శాతం మరణాలకు కారణమయ్యాయి. 2018తో పోల్చితే దేశంలో మొత్తం రోడ్డు ప్రమాదాల సంఖ్య 2019లో 3.86 శాతం తగ్గింది.
రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం రోడ్డు ప్రమాదాల మరణాల తగ్గుదల 2019 సెప్టెంబర్ నుండి అన్నీ రాష్ట్రాల్లో అమలు చేసిన మోటారు వాహన చట్టం ఫలితంగా రహదారి భద్రత, ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఎలక్ట్రానిక్ ఎంఫోర్స్ మెంట్ అమలు చేస్తూ జరిమానాలను కఠినంగా అమలు పర్చడం వల్ల సాధ్యమైంది.