పూణేకు చెందిన కైనెటిక్ గ్రీన్ గోల్ఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సమర్పించింది.
ప్రముఖ స్పోర్ట్స్ వెహికల్ బ్రాండ్ లంబోర్ఘిని ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది,
పూణేకు చెందిన కైనెటిక్ గ్రీన్ గోల్ఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సమర్పించింది.
పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకాపతి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రూ.1,750 కోట్ల వ్యయంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు, బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది.
ఎలక్ట్రిక్ కార్గో 3 వీలర్ సఫర్ జంబో వాహనాన్ని మంగళవారం ఆవిష్కరించిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ ఈ విషయాలు వెల్లడించారు.
కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, సిఇఒ సులజ్జా ఫిరోడియా మోట్వానీ మంత్రి మేకాపతి గౌతమ్ రెడ్డికి ఒక లేఖ రాశారు.
also read
‘గోల్ఫ్ కార్ట్ ప్రాజెక్ట్ కోసం సెజ్‌లో యూనిట్ ఏర్పాటును పరిశీలిస్తున్నాం. సెజ్‌లో యూనిట్‌తో పాటు బ్రాండ్‌తో సంబంధం లేకుండా ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల బ్యాటరీల స్వాపింగ్ (మార్పిడి)కి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని ఆమె తెలిపారు.
సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ ఏర్పాటు చేయాలని కైనెటిక్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. లంబోర్ఘిని వాహనాలతో పాటు కైనెటిక్ గ్రీన్ బ్రాండ్ పేరుతో వాహనాలను ఎగుమతి చేయడానికి ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. రాబోయే పదేళ్లలో రాష్ట్రంలోనే 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు సేల్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆర్‌అండ్‌డిలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం వాణిజ్య వినియోగానికి 1% రాయల్టీ చెల్లించాలని కంపెనీ ప్రతిపాదించింది. దేశంలో బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సేల్స్ కోసం లంబోర్ఘిని 2018లో కైనెటిక్ గ్రీన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి మేకాపతి గౌతమ్ రెడ్డి తెలిపారు.
భారత్‌లో ప్రీమియం సెగ్మెంట్ గోల్ఫ్‌కార్టులు, ఇతరత్రా ఎలక్ట్రిక్ ఆఫ్–రోడ్ వాహనాల డిజైన్, తయారీకి సంబంధించి టొనినో లంబోర్గినితో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు కైనెటిక్ గ్రూప్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
‘దేశంలోనే అతి పెద్ద త్రిచక్ర వాహనాల మార్కెట్లలో ఒకటైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి ఈ–రిక్షాలకు పెద్ద గా మార్కెట్ లేదు. హై–స్పీడ్ త్రీవీలర్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటోంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాలను అందుబాటులోకి తెస్తే ఎలక్ట్రిక్ వాహనాలకూ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది‘ అని సులజ్జా చెప్పారు