
ఇండియాలో ఏవియేషన్ కెరీర్ లో పెద్ద మార్పు రాబోతోంది. DGCA కొత్త ప్రపోజల్ తో, పైలట్ ట్రైనింగ్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ రూల్స్ మారబోతున్నాయి. ఇప్పటివరకు 12th లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివిన వాళ్ళే CPL కి అర్హులు. కానీ ఇప్పుడు ఆర్ట్స్, కామర్స్ స్టూడెంట్స్ కి కూడా అవకాశం కల్పించనున్నారు.
దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ మార్పు వస్తోంది. 1990లలో పైలట్ ట్రైనింగ్ కి ఫిజిక్స్, మ్యాథ్స్ తప్పనిసరి చేశారు. అప్పటినుంచి ఆర్ట్స్, కామర్స్ స్టూడెంట్స్ పైలట్ కావాలంటే ఈ సబ్జెక్టుల్లో అధనంగా ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చేది లేదా ఓపెన్ స్కూల్ ద్వారా చదవాల్సి వచ్చేది.
ఇప్పుడు ఈ రూల్ మారబోతోంది. DGCA ఈ ప్రపోజల్ ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి పంపింది. దీనికి అప్రూవల్ వస్తే, ఏ స్ట్రీమ్ లో అయినా 12th పాస్ అయిన వాళ్ళు పైలట్ ట్రైనింగ్ తీసుకోవచ్చు.
DGCA ప్రపోజల్ ప్రకారం, ఆర్ట్స్, కామర్స్ స్టూడెంట్స్ కూడా పైలట్లు కావచ్చు. మెడికల్ ఫిట్నెస్, ఇతర కండిషన్స్ పూర్తి చేయాలి. ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీకి ఇది పెద్ద మార్పు. చాలా మంది స్టూడెంట్స్ కి కొత్త దారి చూపిస్తుంది.
ఈ మార్పుతో ఫ్లయింగ్ స్కూల్స్ లో స్టూడెంట్స్ సంఖ్య పెరగొచ్చు. అందుకే DGCA, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి వాళ్ళ సౌకర్యాలను పెంచుకోవాలని చెప్పింది. వీటిలో ప్రధానంగా..
ఈ ప్రపోజల్ ని మంచి మార్పుగా చూస్తున్నారు. ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ ఇంకా మెరుగవుతుంది. విద్యార్థుల ప్రతిభ పెరుగుతుంది. అమ్మాయిలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ కి కూడా అవకాశం లభిస్తుంది.