ఇండియన్ నేవీలో 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది.అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇండియన్ నేవీలో '10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్' ద్వారా బీటెక్ కోర్సులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు జేఈఈ మెయిన్-2019 పరీక్షలో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపికైన వారికి 2019 జులైలో శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంతరం వీరికి నేవీలోనే ఉన్నత హోదాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
undefined
also read 10th తర్వాత ఏంటి?: కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీతో నిర్ణయం తీసుకోండి
వివరాలు...
* 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మినెంట్ కమిషన్) - జులై 2020
ఖాళీల సంఖ్య : 37
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో 70 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. జేఈఈ మెయిన్-2019 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు - కనీసం 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఇండియన్ నేవీ నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయసు: 02.01.2001 - 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం..
జేఈఈ మెయిన్-2019 ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది.
ఎంపికైనవారికి ఎస్‌ఎస్‌బీ బోర్డు ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్, వైజాగ్‌లలో 5 రోజులపాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.
రెండు దశల్లో ఇంటర్వ్యూ ప్రక్రియ ఉంటుంది. 'స్టేజ్-1'లో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ ప్రిసిప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారిని 'స్టేజ్-2'కు ఎంపిక చేస్తారు. 'స్టేజ్-2'లో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
also read SBI ఎడ్యుకేషన్ లోన్ పొందడం ఎలా?
శిక్షణ వివరాలు..
ఎంపికైన అభ్యర్థులకు కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ఇంజినీరింగ్ (బీటెక్) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. నేవీ అవసరాల మేరకు అభ్యర్థులకు ఇంజినీరింగ్‌లో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సబ్జెక్టులను బోధిస్తారు.
కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బీటెక్ డిగ్రీని అందజేస్తుంది. అనంతరం వారికి నేవీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.
పేస్కేల్: ఇంజినీరింగ్ డిగ్రీ అందుకున్న అభ్యర్థులను సబ్ లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు. వీరికి నెలకు సుమారుగా రూ.83,448-96,204 జీతం చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 29.11.2019.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 19.12.2019.
కోర్సు ప్రారంభం: 2020 జులై.