జెట్ లేని చోట: రికార్డులు సృష్టిస్తున్న ఇండిగో, స్పైస్‌జెట్ షేర్లు

By rajashekhar garrepallyFirst Published Apr 26, 2019, 4:05 PM IST
Highlights

ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి విమాన సేవలను జెట్ ఎయిర్‌వేస్ తాత్కాలికంగా నిలిపివేయడం ఇతర విమానయాన సంస్థలకు ప్రయోజనకరంగా మారింది. ముఖ్యంగా ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలకు బాగా కలిసివస్తోంది.

ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి విమాన సేవలను జెట్ ఎయిర్‌వేస్ తాత్కాలికంగా నిలిపివేయడం ఇతర విమానయాన సంస్థలకు ప్రయోజనకరంగా మారింది. ముఖ్యంగా ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలకు బాగా కలిసివస్తోంది.

ఈ రెండు సంస్థల షేర్లు భారీ లాభాలను నమోదు చేస్తుండటం గమనార్హం.  గత ఆరు నెలల కాలంలో ఇండిగో, స్పైస్‌జెట్ వరుసగా 80శాతం, 77శాతం చొప్పున లాభాలు మూటగట్టుకున్నాయి. 

అంతేగాక, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానయాన షేర్లుగా నిలవడం విశేషం. ఇండిగో అయితే 8.1 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచ 10 అగ్రగామి సంస్థల జాబితాలోకి చేరిపోవడం విశేషం. 

ఇక నిపుణులైన జెట్ సిబ్బందిని తక్కువ వేతనాలకు తీసుకుంటూ.. ఈ రెండు సంస్థలు సర్వీసులను కూడా ఎక్కువగా నడుపుతున్నాయి. జెటా మార్కెట్ వాటాను ఈ రెండు సంస్థలు పూర్తిగా వాడుకుంటున్నాయి. 

ప్రపంచంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్ ఇండియాదే కావడం గమనార్హం. ఏటా 45-50 విమానాలు జత చేరుతూ ప్రయాణికుల అవసరాలు తీరుస్తున్నాయి. 

ఒకప్పుడు 123 విమానాలతో సర్వీసులు నిర్వహించిన జెట్ ఎయిర్‌వేస్ సేవలు నిలిచిపోవడంతో.. ఆ స్థానంలో ఇండిగో, స్పైస్‌జెట్‌లు కలిసి అదనంగా 100 విమానాలను నడుపుతున్నాయి. ఇలా జెట్ ఎయిర్‌వేస్ వదిలేసిన మార్కెట్‌ను ఇండిగో, స్పైస్‌జెట్‌ తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీ ప్రయోజనాలు పొందుతున్నాయి.

సంబంధిత వార్తలు:

కన్నీళ్లే మిగిలాయి: ‘జెట్ ఉద్యోగులూ మీడియాతో వద్దు’

జెట్‌ను నడుపతాం: భారత, బ్రిటీష్‌ పీఎంలకు బ్రిటన్‌ ఇన్వెస్టర్ లేఖ

click me!