Whisky Prices: మందుబాబులకు గుడ్ న్యూస్! విస్కీ ధరలు తగ్గనున్నాయి. ఇక పండగే పండగ..

Published : May 29, 2025, 11:06 PM IST
Whisky Prices: మందుబాబులకు గుడ్ న్యూస్! విస్కీ ధరలు తగ్గనున్నాయి. ఇక పండగే పండగ..

సారాంశం

మందుబాబులకు మత్తెక్కించే వార్త ఇది. త్వరలో విస్కీ ధరలు తగ్గనున్నాయి. ఈ విషయాన్ని ఇండియాలో మద్యం వ్యాపారం చేసే ఫ్రాన్స్ కంపెనీయే స్వయంగా వెల్లడించింది. ఎందుకు ధరలు తగ్గుతున్నాయో తెలుసుకుందాం రండి.

ప్రస్తుత సమాజంలో చాలామంది రాత్రయితే చాలు.. ఒక పెగ్గు వేసుకొని హాయిగా నిద్రపోతారు. మద్యం ధరలు పెరిగినా, తగ్గినా మందు అమ్మకాల్లో ఏమీ తేడా ఉండదు. అందుకే మద్యం వ్యాపారం ఇండియాలో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం మద్యం వ్యాపారం ఇండియా మొత్తం మీద చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పుడు విస్కీ ధరలు తగ్గనున్నాయన్న విషయంపై మద్యం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయి. విస్కీ ధరలు ఎందుకు తగ్గుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ధరలు తగ్గుతాయన్న పెర్నోడ్ రికార్డ్ ఇండియా

భారతీయ రిటైల్ మార్కెట్లో త్వరలోనే స్కాచ్, విస్కీ ధరలు తగ్గనున్నాయని పెర్నోడ్ రికార్డ్ ఇండియా తెలిపింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ స్కాచ్, విస్కీ తయారీ సంస్థ అయిన పెర్నాడ్ రికార్డ్ భారతీయ విభాగం పి.ఆర్.ఐ. వ్యాపార ఒప్పందం తర్వాత పన్ను 75% తగ్గిందని వెల్లడించింది. బ్రిటన్‌తో కొత్త వ్యాపార ఒప్పందం వల్ల, దిగుమతి చేసుకునే విస్కీపై కూడా పన్ను తగ్గింది. దీంతో బ్రిటన్ నుంచి విస్కీ దిగుమతి ఖర్చు తగ్గడంతో ఇండియాలో విస్కీ ధరలు తగ్గనున్నాయన్న మాట.

ఏమిటీ.. పెర్నోడ్ రికార్డ్ ఇండియా

పెర్నోడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Pernod Ricard India Private Limited) అనేది ఒక ఫ్రెంచ్ కంపెనీ. ఇది పెర్నోడ్ రికార్డ్ SA అనుబంధ సంస్థ. ఇది భారతదేశంలో వైన్, స్పిరిట్స్ ఉత్పత్తి చేస్తుంది. పంపిణీ కూడా చేస్తుంది. సీగ్రామ్, రాయల్ స్టాగ్, బ్లెండర్స్ ప్రైడ్, ఇతర బ్రాండ్ల వంటి పలు ప్రసిద్ధ స్పిరిట్స్ బ్రాండ్ల పోర్ట్‌ఫోలియోను పెర్నోడ్ రికార్డ్ ఇండియా కలిగి ఉంది.

రిటైల్ ధరలు కూడా తగ్గుతాయి

"వ్యాపార ఒప్పందం వల్ల, హై క్వాలిటీ స్కాచ్, విస్కీ ధరలు పోటీగా ఉంటాయి. దిగుమతి పన్ను తగ్గడంతో చాలా రాష్ట్రాల్లో రిటైల్ ధరలు తగ్గుతాయి" అని పి.ఆర్.ఐ వార్తా సంస్థ వెల్లడించింది. 

ఎక్కువ మందికి విక్రయించాలని ప్రయత్నాలు

వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరికీ ఈ చర్య ప్రయోజనం చేకూరుస్తుందని పి.ఆర్.ఐ భావిస్తోంది. పన్ను తగ్గింపు ద్వారా దిగుమతి చేసుకున్న స్కాచ్, విస్కీని అందరూ కొనుగోలు చేసేలా చూడాలని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఎక్కువ మంది విస్కీ కొనేలా ప్రత్యేక స్కీమ్ లు కూడా అమలు చేయనున్నాయని సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే