
మెటా యాజమాన్యంలోని పాపులర్ ఇన్‌స్టంట్ కమ్యూనికేషన్ యాప్ వాట్సాప్ ఇండియాలో డౌన్ అయ్యింది. వాట్సాప్ ని ఇండియాలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ కోసం చాలా మంది ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోని వాట్సాప్ యూజర్లు ప్రస్తుతం మెసేజెస్ పంపడం అలాగే రిసీవ్ చేస్కోవడంలో సమస్యలు ఎదురుకొంటున్నారు. చాలా మంది వాట్సాప్ యూజర్లు ట్విట్టర్‌లో ఈ వాట్సాప్ సమస్యలను లేవనెత్తారు.
వేలకొద్దీ యూజర్లకు వాట్సాప్ పని చేయడం లేదని అవుట్‌టేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్ తెలిపింది. వెబ్‌సైట్ హీట్-మ్యాప్ ఆధారంగా వాట్సాప్ ప్రభావిత ప్రాంతాలలో ముంబై , ఢిల్లీ , కోల్‌కతా, లక్నో వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి. అయితే ఈ అంతరాయం ప్రతిచోటా ఉన్న యూజర్లను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. వాట్సాప్ ఇంకా దీని సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చాలా మంది యూజర్లు యాప్‌ని ఓపెన్ చేశాక మెసేజెస్ అండ్ మీడియా ఫైల్‌లను పంపలేకపోతున్నారు. అలాగే యూజర్లు వాట్సాప్ ఆడియో అండ్ వీడియో కాల్స్ వంటి ఇతర సేవలను కూడా ఉపయోగించలేకపోతున్నారు.
అవుట్‌టేజ్ ట్రాకర్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం, చాలా మంది యూజర్లు ఈరోజు అక్టోబర్ 25 మధ్యాహ్నం 12:30 గంటల నుండి వాట్సాప్ మొబైల్ యాప్ అండ్ వెబ్‌తో సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించింది.
69 శాతం మంది యూజర్లు మెసేజెస్ పంపడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని, 21 శాతం మంది యూజర్లు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని డౌన్‌డెటెక్టర్ ఎత్తి చూపింది. దాదాపు 9 శాతం మంది యూజర్లు స్మార్ట్‌ఫోన్ యాప్‌తో తెలియని సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ట్విటర్‌లో వాట్సాప్ యూజర్లు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం వాట్సాప్ డౌన్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్ గా మారింది. అయితే వాట్సాప్ ఈ సమస్యకి ఖచ్చితమైన కారణం అస్పష్టంగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ వంటి ఇతర మెటా-యాజమాన్య సేవలు భారతదేశంలో బాగా పని చేస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాల్లోని వాట్సాప్ యూజర్లు కూడా ఈ అంతరాయంతో ప్రభావితమైనట్లు కనిపిస్తోంది.