
ఇంధన ధరలు చాలా కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి, అయితే దీపావళి తరువాత కొన్ని నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. నిన్న గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. అయితే ఇంధన ధరలను ప్రభుత్వ ఆధీనంలోని చమురు కంపెనీలు ప్రతిరోజూ సమీక్షిస్తాయి.
ఏ రాష్ట్రంలో ధరలు
దీపావళి తరువాత రోజు దేశంలోని మెట్రో నగరాలలోని ఇంధన ధరలలో ఎటువంటి మార్పు లేదు, కానీ యుపిలోని పెద్ద నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. బీహార్‌లో కూడా ధరలు స్థిరంగా ఉన్నాయి.
IOCL సమాచారం
ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ నుండి అందిన సమాచారం ప్రకారం, ఈ రోజు యూపిలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో (నోయిడా-గ్రేటర్ నోయిడా) ఇంధర ధర 31 పైసలు పెరిగి పెట్రోల్ ధర రూ. 97కి, డీజిల్ ధర లీటరుకు 28 పైసలు పెరిగి రూ.90.14కి చేరుకుంది.
ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు 35 పైసలు పెరిగి రూ.96.58కి, డీజిల్ ధర లీటర్‌కు 33 పైసలు పెరిగి రూ.89.75కి చేరుకుంది. యూపీ రాజధాని లక్నోలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 8 పైసలు పెరిగి పెట్రోల్ రూ.96.44, డీజిల్ రూ.89.64గా ఉంది. క్రూడాయిల్ గురించి మాట్లాడినట్లయితే గత 24 గంటల్లో పెద్దగా మార్పు లేదు. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $ 93.54కి స్వల్పంగా పడిపోయింది, అయితే WTI బ్యారెల్‌కు $ 84.93 వద్ద ఉంది.
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర రూ . 89.62
ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ . 94.27
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24
కోల్‌కతాలో పెట్రోలు ధర రూ. 106.03, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66, డీజిల్ ధర రూ.97.82
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల అవుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.