యస్‌బ్యాంకు సంక్షోభంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. ఆర్‌బీఐ ఆంక్షలు, డిపాజిటట్‌దారుల ఆందోళన నేపథ్యంలోశుక్రవారం మీడియాతో మాట్లాడారు
బ్యాంక్ ఆర్ధిక స్థితిలో తీవ్ర క్షీణత కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) యెస్ బ్యాంక్ బోర్డును 30 రోజుల పాటు రద్దు చేసింది. ఏప్రిల్ 3 వరకు యెస్ బ్యాంక్ ఖాతాదారులకు రూ.50 వేలు వరకు ఉపసంహరణ పరిమితిని విధించింది.
యెస్ బ్యాంక్ డిపాజిటర్లకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిపాజిటర్లకు హామీ ఇచ్చారు.యస్‌బ్యాంకు సంక్షోభంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు.
undefined
also read కొత్త రికార్డు స్థాయికి బంగారం ధరలు...10 గ్రాములకి ఎంతంటే ?
ఆర్‌బీఐ ఆంక్షలు, డిపాజిటట్‌దారుల ఆందోళన నేపథ్యంలోశుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆర్థికమంత్రి డిపాజిట్ దారుల సొమ్ముఎక్కడికీ పోదనీ, పూర్తి భద్రంగా వుంటుందని హామీ ఇచ్చారు.
ప్రతి డిపాజిటర్ డబ్బు సురక్షితంగా ఉందనీ, ఈ విషయంలో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తో తాను నిరంతరం మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. యస్ బ్యాంకు విషయంలో ఆర్‌బీఐ సరియైన పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరంగా తీసుకుంటుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ముందుస్తు పరిష‍్కారంకోసం బ్యాంకింగ్ రెగ్యులేటరీ చాలా త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు.
also read టాటా సన్స్ బ్యాంక్ అక్కౌంట్ నుండి 200 కోట్లు హ్యాక్...
ఆర్థికమంత్రి హామీతో యస్ బ్యాంకు షేర్లు భారీగా కోలుకుంది. ఉదయం ట్రేడింగ్‌లో 85 శాతం కుప్పకూలి రూ.5.65 వద్ద 52 వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం పుంజుకుని ప్రస్తుతం రూ. 17 వద్ద కొనసాగుతోంది.
అంతకుముందు రోజు, ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఇబ్బందికరమైన మొండి రుణాలను పునరుద్ధరించడానికి ఒక పథకాన్ని కలిగి ఉంది. మేము దీనిపై వేగంగా చర్యలు తీసుకుంటాము అలాగే బ్యాంకును పునరుద్ధరించడానికి మాకు ఒక పథకం ఉంది అని శక్తికాంత దాస్ అన్నారు.