యాడ్స్ ఎంతసేపు ప్లే చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే దాని ఆధారంగా రేట్ ఉంటుంది. ఉదాహరణకు, 3 నిమిషాల వీడియో లేదా యాడ్ ఒకసారి ప్లే చేస్తే మీకు సుమారు $68,073 ఖర్చు అవుతుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫాపై ప్రకటన(advertising) చేయాలనుకుంటున్నారా ? ఇప్పుడు బుర్జ్ ఖలీఫాపై సినిమాలతో సహా ఎన్నో ప్రకటనలు ప్రదర్శిస్తున్నారు. అయితే మీరు కూడా బుర్జ్ ఖలీఫాపై ప్రకటన చేయాలనుకుంటే గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ముందుగా, బుర్జ్ ఖలీఫాపై ప్రకటన చేయాడానికి మీకు బిల్డింగ్ ఓనర్ ఎమ్మార్ ప్రాపర్టీస్ నుండి అనుమతి అవసరం. వీరి సమ్మతి లేకుండా యాడ్స్ (ads) ప్రదర్శించలేరు.
యాడ్స్ ఎంతసేపు ప్లే చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనే దాని ఆధారంగా రేట్ ఉంటుంది. ఉదాహరణకు, 3 నిమిషాల వీడియో లేదా యాడ్ ఒకసారి ప్లే చేస్తే మీకు సుమారు $68,073 ఖర్చు అవుతుంది. అంటే దాదాపు రూ.57 లక్షలు. ఇప్పుడు వీకెండ్స్ లో యాడ్ రన్ చేయాలనేది మీ ప్లాన్ అయితే, దానిని ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు రన్ చేయడానికి అయ్యే ఖర్చు $95,289. అంటే దాదాపు రూ.79.6 లక్షలు. వీకెండ్స్ లో అర్ధరాత్రి వరకు స్క్రీనింగ్ చేస్తే దాదాపు రూ.2.27 కోట్లు ఖర్చవుతుంది.
దుబాయ్‌కు చెందిన ముల్లెన్ లోవే మేనా బుర్జ్ ఖలీఫా పై యాడ్స్ నిర్వహిస్తున్న సంస్థ. మీరు మీ బ్రాండ్ లేదా ఏదైనా వీడియో ప్లే చేయడానికి బుర్జ్ ఖలీఫాను ఉపయోగించాలనుకుంటే ఇందుకు మీరు అవసరమైన అనుమతిని పొందాలి ఇంకా యాడ్స్ ఖర్చుల కోసం డబ్బును కేటాయించాలి.