Latest Videos

ముఖేష్ అంబానీ డీప్ ఫేక్ వీడియో.. లక్షలు పోగొట్టుకున్న డాక్టర్..

By Ashok KumarFirst Published Jun 21, 2024, 6:21 PM IST
Highlights

ముంబైలో నివాసం ఉంటున్న ఆయుర్వేద డాక్టర్ ఈ ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్ అనే కంపెనీ గురించి ముఖేష్ అంబానీ మాట్లాడటం చూశానని డాక్టర్ చెప్పారు. 

డీప్‌ఫేక్ వీడియోలకు సంబంధించి రోజురోజుకు కొత్త కేసులు బయటకు వస్తున్నాయి. సినీ స్టార్స్ నుంచి క్రికెటర్లు, వ్యాపారవేత్తల వరకు డీప్‌ఫేక్ వీడియోలు ఇప్పటివరకు బయటపడ్డాయి. తాజాగా ముఖేష్ అంబానీ డీప్‌ఫేక్ వీడియో ద్వారా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖేష్ అంబానీ డీప్‌ఫేక్ వీడియో నిజమేనని భావించి స్టాక్‌మార్కెట్‌లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి  మోసపోయిన ఓ డాక్టర్ ఘటన బయటకి వచ్చింది. అయితే అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ముంబైలో నివాసం ఉంటున్న ఆయుర్వేద డాక్టర్ ఈ ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్ అనే కంపెనీ గురించి ముఖేష్ అంబానీ మాట్లాడటం చూశానని డాక్టర్ చెప్పారు. రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్ యాజమాన్యంలోని BDF ఇన్వెస్ట్‌మెంట్ అకాడమీలో అంబానీ చేరినట్లు ఉన్న ఫేక్  వీడియో అది. మాతో చేరితే ఎక్కువ ఆదాయం వస్తుందని ముఖేష్ అంబానీ చెబుతున్నట్లు వీడియోలో చూపించారు.

వీడియో నిజమని నమ్మి అకాడమీలో చేరిన తర్వాత అంబానీకి సంబంధించిన కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందని నమ్మించారని డాక్టర్ చెప్పారు. దీని ప్రకారం మే 28 నుంచి జూన్ 10 వరకు వివిధ అకౌంట్లకు రూ.7.1 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. చివరకు మోసగాళ్లు చూపిన వెబ్‌సైట్‌లో డాక్టర్ పెట్టుబడి రూ.30 లక్షలకు పెరిగినట్లు కనిపించింది. అయితే ఈ డబ్బు విత్‌డ్రా కాకపోవడంతో మోసం జరిగినట్లు భావించాడు. ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ముఖేష్ అంబానీ రెండవ డీప్‌ఫేక్ వీడియో

ముఖేష్ అంబానీపై ఇది రెండో డీప్ ఫేక్ వీడియో. అతని మొదటి డీప్‌ఫేక్ వీడియో ఈ ఏడాది మార్చిలో బయటకి వచ్చింది. అతను స్టాక్ ట్రేడింగ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఎండార్స్ చేస్తున్నట్లు డీప్‌ఫేక్ వీడియోలో చూడవచ్చు. అందులో ఉచిత పెట్టుబడి సలహాల కోసం సోషల్ మీడియాలో నా 'స్టూడెంట్' వినీత్‌ని ఫాలో కావాలని ప్రజలను కోరుతాడు.

click me!