ఓ ప్రైవేట్ కంపెనీ వ్యవస్థాపకుడు ఉద్యోగులు టైంకి ఆఫీస్ చేరుకుని పనిలో ఉండాలని కచ్చితమైన రూల్ పెట్టారు. ఒకవేళ ఆఫీస్ రావడం ఆలస్యమైతే రూ.200 జరిమానా విధించాలని కోరారు. కానీ అతనే 5 సార్లు ఆఫీస్ లేట్ వచ్చి రూ.1000 ఫైన్ కట్టారు.
ముంబై: ప్రోడక్ట్ తయారీ(manufaturing) కంపెనీల్లో ఉద్యోగులు టైంకి రావడం కాస్త ఆలస్యమైనా ఉత్పత్తి తగ్గుతుంది. ఇందుకోసమే ఉద్యోగులు టైంకి రావాలని సూచిస్తుంటారు. చాలా కంపెనీలు ఆలస్యమైతే ఆరోజు సగం జీతం కట్ చేయడం సహా కఠినమైన నిబంధనలు కూడా ఉంటాయి. ఇలా ముంబైకి చెందిన బ్యూటీ బ్రాండ్ ఎవర్( Evor Beauty) బ్యూటీ కంపెనీ వ్యవస్థాపకుడు కౌశల్ షా ఆఫీసుకు ఆలస్యంగా వస్తే రూ.200 జరిమానా విధించాలని రూల్ విధించారు. కానీ 5 సార్లు కంపెనీ వ్యవస్థాపకుడు కౌశల్ షా ఆఫీసుకు ఆలస్యంగా వచ్చి, అతనే ఇప్పుడు రూ. 1,000 జరిమానా చెల్లించాడు.
రూల్స్ తానే అమలు చేసి చివరకు జరిమానా కూడా తానే చెల్లించిన కౌశల్ షా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. ఎవర్ బ్యూటీ కంపెనీలో ఉద్యోగులు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య వచ్చేవారు. దింతో పనిలో కొంత ఆలస్యం ఏర్పడి ఉత్పత్తి రోజురోజుకూ మందగించింది. ఇతర కంపెనీలతో పోలిస్తే ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.
దీనికి పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ 9.30 గంటలకు ఆఫీసులో రిపోర్టు చేయాలని కంపెనీ వ్యవస్థాపకుడు కౌశల్ షా తెలిపారు. ఉదయం 9.30 గంటలలోగా ఆఫీస్ రాకపోతే 200 రూపాయల ఫైన్ కట్టాలి అంటూ కౌశల్ షా కఠినమైన రూల్ అమలు చేశాడు. కానీ కౌశల్ షా స్వయంగా ఒక నెలలో 5 సార్లు ఆలస్యంగా వచ్చాడు. ఇలా మొత్తం 1,000 రూపాయల ఫైన్ కట్టారు.
ఉత్పత్తి పెంచేందుకు గత వారం కఠిన రూల్ అమలు చేశాను. అందరు ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆఫీస్ చేరుకుంటారు. కానీ అందరూ 9.30కే తప్పకుండా ఆఫీస్ రావాలి, ఆలస్యమైతే 200 రూపాయల ఫైన్ పేరుతో టీమ్ రూల్ అమలు చేశాను. చివరకు తానే ఇప్పుడు 5వ సారి ఫైన్ కడుతున్నట్లు Xలో పోర్ట్ షేర్ చేసారు.
ఈ పోస్ట్‌ను చూసి కంపెనీ వ్యవస్థాపకుడు జరిమానా మొత్తాన్ని తన అకౌంట్ నుండి తన అకౌంట్లోకే ఫైన్ చెల్లించాడ అని చాలా మంది కామెంట్ చేయగా, దీనిపై కౌశల్ షా క్లారిటీ ఇచ్చాడు. ఫైన్ చెల్లించడానికి ప్రత్యేక అకౌంట్ ఉంది. ఈ అకౌంట్లో జమ అయిన జరిమానా మొత్తం ఉద్యోగుల అక్టీవిటీస్ కోసం ఉపయోగించబడుతుంది. టీమ్ లంచ్ సహా ఉద్యోగుల కోసం అనేక కార్యక్రమాలకు ఈ డబ్బును వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.