Visa complains about india: భారత్‌పై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన వీసా.. ఎందుకంటే..?

By team teluguFirst Published Nov 30, 2021, 12:07 PM IST
Highlights

ప్రముఖ ఫైనాన్షియల్‌ సర్వీసుల సంస్థ వీసా (Visa Inc).. భారత్‌పై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. భార‌తదేశంలోని కేంద్ర ప్రభుత్వం దేశీయ పేమెంట్స్ సంస్థ రూపేను (RuPay) అధికారికంగా, అన‌ధికారికంగా ప్రోత్స‌హిస్తున్న‌ద‌ని ఫిర్యాదులో ఆరోపించింది.

ప్రముఖ ఫైనాన్షియల్‌ సర్వీసుల సంస్థ వీసా (Visa Inc).. భారత్‌పై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. భార‌తదేశంలోని కేంద్ర ప్రభుత్వం దేశీయ పేమెంట్స్ సంస్థ రూపేను (RuPay) అధికారికంగా, అన‌ధికారికంగా ప్రోత్స‌హిస్తున్న‌ద‌ని ఫిర్యాదులో ఆరోపించింది. ఈ పరిణామాల వల్ల భారత్‌లో వీసా భారీగా దెబ్బతింటుందని.. ఆ కంపెనీ అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్థానిక కార్డులు వినియోగాన్ని జాతీయ సేవాతో పోల్చారని.. దీంతో రూపే కార్డులకు భారీగా మద్దతు పెరిగినట్టుగా వీసా సంస్థ అమెరికా ప్రభుత్వానికి దాఖలు చేసిన మెమోలో పేర్కొంది.

ఆగస్టు నెలలో వీసా సంస్థ సీఈవో అల్‌ఫ్రెడ్ కెల్లీతోపాటు వీసా ఎగ్జిక్యూటివ్‌లు.. యూఎస్ ట్రేడ్ రిప్ర‌జెంటేటివ్ (USTrade Representative) కేథ‌రిన్ తాయ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్‌లో వారికి సమాన అవకాశాలపై వీసా సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేసినట్టుగా US ప్రభుత్వ మెమోలు చూపెడుతున్నట్టుగా రాయిటర్స్ తెలిపింది. 

ఇక, 2012లోనే ఇండియ‌న్ మ‌ల్టీ నేష‌న‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ అండ్ పేమెంట్స్ స‌ర్వీసుల వ్య‌వ‌స్థ‌గా రూపేను ఎన్పీసీఐ (NPCI) ప్రారంభించింది. ఏలాంటి లాభాపేక్షలేకుండా నడుపుతోంది. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న చెల్లింపుల మార్కెట్‌లో వీసా మరియు మాస్టర్‌కార్డ్ (MA.N) లకు సవాలు విసురుతూ రూపే ముందుకు సాగుతుంది. 2020 నవంబర్ నాటికి భారత్‌లోని 952 మిలియన్ల డెబిట్ , క్రెడిట్ కార్డ్‌లలో రూపే 63 శాతం వాటాను కలిగి ఉంది. కానీ 2017లో ఇది కేవ‌లం 15 శాతంగా ఉంది. నరేంద్ర మోదీ 2014లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూపే కార్డను ప్రోత్సహించారు. దీంతో రూపే కార్డుకు జనాల్లో విపరీతమైన ఆదరణ లభించింది. 

అయితే దీనిపై స్పందించాల్సిందిగా చేసిన అభ్యర్థనపై వీసా సంస్థ గానీ, యూఎస్‌టీఆర్, మోదీ కార్యాలయం, ఎన్‌పీసీఐ‌ల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని రాయిట్స్ తెలిపింది. 

Also read: Bank Holidays in December 2021: డిసెంబర్‌లో 12 రోజులు బ్యాంక్‌లకు సెలవులు.. ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి..

మరో ఫైనాన్షియల్‌ సర్వీసుల సంస్థ మాస్టర్ కార్డు కూడా 2018లో ఇలాంటి ఆందోళననే యూఎస్‌టీఆర్ వద్ద లేవనెత్తింది. నెట్‌వర్క్‌ను ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ జాతీయవాదాన్ని ఉపయోగిస్తున్నట్లుగా ఫిర్యాదు చేసింది. అయితే 2018 నిబంధనలకు అనుగుణంగా లేదని రిజర్వ్‌ బ్యాంక్ ఆదేశాలతో.. మాస్టర్ కార్డ్ భారత్‌లో కొత్త కార్డ్‌లను జారీ చేయడంపై నిరవధిక నిషేధాన్ని ఎదుర్కొంటుంది. యూఎస్‌టీఆర్‌ అధికారి ఒకరు మాస్టర్‌కార్డ్ నిషేధంపై స్పందిస్తూ క్రూరమైన చర్య అని వ్యాఖ్యానించారు. 

click me!