చైనా అత్యంత సంపన్నుడికి కరోనా సెగ...జాక్‌ మా స్ధానంలో పోనీ మా..

By Sandra Ashok KumarFirst Published Jun 25, 2020, 5:47 PM IST
Highlights

చైనాకి చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు ఈక్విటీ మార్కెట్‌లో ఈ వారంలో 40 బిలియన్ డాలర్లు  పెరగటం, పిండుడువో ఇంక్ లాభాలు చైనా ధనవంతుల ర్యాంకింగ్‌ను తిరగరాశాయి.

బీజింగ్‌ : కరోనా వైరస్ మహమ్మారి డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసింది అంతేకాదు వినియోగదారుల అలవాట్లను, ఇంకా అనేక ఇంటర్నెట్ సంస్థల వాటాలను కూడా పెంచింది. చైనాకి చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు ఈక్విటీ మార్కెట్‌లో ఈ వారంలో 40 బిలియన్ డాలర్లు  పెరగటం, పిండుడువో ఇంక్ లాభాలు చైనా ధనవంతుల ర్యాంకింగ్‌ను తిరగరాశాయి.

దేశంలోని అతిపెద్ద గేమ్ డెవలపర్ అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్‌ను టెన్సెంట్ హోల్డింగ్స్ అధిగమించి ఆసియాలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచింది, దాని షేర్లు బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో మొదటిసారి $ 500 పైన పెరిగాయి. పిడిడి అని పిలువబడే షాపింగ్ యాప్ పిండుడువో లాభాలు ఈ సంవత్సరం రెట్టింపు అయ్యాయి.

కంపెనీ వ్యవస్థాపకుల సంపద వారిని మరింత మలుపు తిప్పాయి. 50 బిలియన్ డాలర్ల సంపద కలిగిన టెన్సెంట్ చెందిన పోనీ మా, ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా 48 బిలియన్ డాలర్ల సంపదను అధిగమించి చైనా దేశ అత్యంత ధనవంతుడి స్థానాన్ని దక్కించుకున్నాడు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం పిడిడికి చెందిన కోలిన్ హువాంగ్, 43 బిలియన్ డాలర్లు నికర సంపదతో, చైనా ఎవర్‌గ్రాండే గ్రూపుకు చెందిన రియల్ ఎస్టేట్ మొగల్ హుయ్ కా యాన్‌ నాలుగో స్ధానానికి నెట్టేసి మూడు స్థానంలో నిలిచాడు. ఇప్పుడు టెక్ దిగ్గజాలు చైనా ధనవంతుల ర్యాంకుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

also reaad 

వారు మొదటి ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలను ఆక్రమించారు. కొత్త గేమ్స్ కోసం ఆమోదం ప్రక్రియను చైనా స్తంభింపజేసినప్పుడు 2018లో కనిష్ట స్థాయిని చేరుకున్నప్పటి నుండి టెన్సెంట్ సంస్థ చాలా దూకుడుతో వచ్చింది. అప్పటి నుండి దీని స్టాక్ దాదాపు రెట్టింపు అయ్యింది. గత నెలలో దీని  మొదటి త్రైమాసిక ఆదాయంలో 26 శాతం లాభం పెరిగింది.

కంపెనీలో 7 శాతం వాటాను కలిగి ఉన్న 48 ఏళ్ల పోనీ మాకి ఇది ఒక వరం అని చెప్పాలి  చైనా దక్షిణ గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్థానికుడు షెన్‌జెన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. 1990 చివరలో టెన్సెంట్‌ను మరో నలుగురితో సహ-స్థాపనకు ముందు టెలికాం సేవలు, ఉత్పత్తుల సరఫరాదారుడి వద్ద సాఫ్ట్‌వేర్ డెవలపర్ గా పనిచేశాడు.

ఆ సమయంలో ఆ సంస్థ ఇన్స్టంట్ -మెసేజెస్ సేవలపై దృష్టి పెట్టింది. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వాంగ్ జియాన్లిన్‌ను 2013 లో చైనా రెండవ అత్యంత ధనవంతుడిని అధిగమించాడు. 2020 లో టెన్సెంట్ షేర్లు 31 శాతం పెరిగాయి, అలీబాబా కేవలం 6.9 శాతం మాత్రమే అభివృద్ధి చెందింది.

click me!