బంగారం కొనడం కష్టమే.. మరో రెండేళ్లలో రూ.68వేలకు..

By telugu news teamFirst Published Jun 25, 2020, 2:15 PM IST
Highlights

రానున్న రోజుల్లో బంగారం ధరలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని బులియన్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

బంగారం ధర రోజు రోజుకీ ఆకాశాన్నంటుతోంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సమయంలో.. బంగారం ధర కాస్త తగ్గినట్లే అనిపించింది. ప్రతి సంవత్సరం అక్షయ తృతియ రోజు బంగారు దుకాణాల వద్ద బారులు తేరే జనాలు లాక్ డౌన్ కారణం గా కనీసం అటువైపు చూడనేలేదు. ఆన్ లైన్ అవకాశం కల్పించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఆ సమయంలో ధర కాస్త తక్కువగానే ఉంది. కానీ.. ఇప్పుడు మళ్లీ ఆకాశాన్నంటుతుంది. అయితే.. మరో రెండేళ్లలో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌(ఎంసీఎక్స్‌) మార్కెట్లో బుధవారం 10గ్రాముల బంగారం ధర 48,589 రూపాయిల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. రానున్న రోజుల్లో బంగారం ధరలో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని బులియన్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

భారత ఆర్థికవృద్ధి అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తగ్గించడం, చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు, దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ర్యాలీ చేసే అవకాశం తదితర అంశాలు దేశీయంగా బంగారానికి డిమాండ్‌ను పెంచుతాయని బులియన్‌ పండితులు అంటున్నారు. ఈ క్రమంలో వచ్చే రెండేళ్లలో 10గ్రాముల బంగారం ధర రూ.68వేల స్థాయికి చేరుకోవచ్చని వారు అంచనా వేస్తున్నారు.  

click me!