వెంటాడుతున్న కరోనా కష్టాల.. ఆ సంస్థ నుండి 6వేల ఉద్యోగులు ఇంటికి..

By Sandra Ashok KumarFirst Published Jun 25, 2020, 12:33 PM IST
Highlights

కరోనా తీసుకొచ్చిన కష్టాలతో కుదేలవ్వని రంగం లేదు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ ఎయిర్వేస్ తన నష్టాల నుంచి బయట పడేందుకు 20 శాతం మంది ఉద్యోగులను సాగనంపాలని నిర్ణయించుకున్నది. అందులో 6,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపేసింది. 
 

సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి ఎఫెక్ట్ ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్వాంటాస్ ఎయిర్‌వేస్‌పై పడింది. కరోనా ప్రభావం వల్ల వచ్చే ఏడాది వరకు అంతర్జాతీయ ప్రయాణాలకు అనుమతించే అవకాశం లేదని ఆస్ట్రేలియా అధికారులు చెప్పేశారు. దీంతో క్వాంటాస్ ఎయిర్‌వేస్‌ తన ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

కరోనా ప్రభావం వల్ల తమ ఆస్ట్రేలియా వైమానిక సంస్థకు చెందిన 100 విమానాలను 12 నెలల వరకు నడపలేమని, దీనివల్ల ఆదాయం తక్కువగా ఉన్నపుడు సంస్థను నిలబెట్టుకునేందుకు ఉద్యోగులను తగ్గించక తప్పడం లేదని క్వాంటాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ జాయిస్ చెప్పారు.

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇతర విమానయాన సంస్థలతోపాటు ఆస్ట్రేలియా కూడా తమ దేశ సరిహద్దులను మూసివేసిన తర్వాత క్వాంటాస్ ఎయిర్‌వేస్‌ తీవ్ర నష్టాలను చవిచూసింది. విద్యార్థుల కోసం ప్రయాణ నిబంధనలను సడలించినా, వచ్చే ఏడాది వరకు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు నడిపే అవకాశం లేదని ఆస్ట్రేలియా అధికారులు చెప్పారు.

also read  మరింత దిగజారుతున్న భారత వృద్ధిరేటు.. వచ్చే ఏడాదిపైనే ఆశలు..

తమ సంస్థలో ఉన్న 29వేల మంది ఉద్యోగుల్లో 6వేల మందిని తొలగిస్తున్నామని, మరో 15వేలమందిని తాత్కాలికంగా వారి సేవలు ఆపి, అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించగానే వారిని విధుల్లోకి తీసుకుంటామని క్వాంటాస్ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. 

సంస్థను గాడిలో పెట్టడానికి 190 కోట్ల డాలర్ల పెట్టుబడి సమీకరించాలని క్వాంటాస్ ఎయిర్వేస్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగ పలు విమానయాన సంస్థలు తమ మనుగడ కోసం పునర్వ్యవస్థీకరణ పనులు చేపట్టాయని పేర్కొంది. ప్రపంచ దేశాల్లోని విమానయాన సంస్థలు 8400 కోట్ల డాలర్లకు పైగా నష్టపోతాయని భావిస్తున్నారు. 

వచ్చే అక్టోబర్ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను క్వాంటాస్ ఎయిర్వేస్ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మూడేళ్లలో రికవరీ సాధన కోసం ప్రణాళిక రూపొందించామని వెల్లడించింది. 15 బిలియన్ల ఆస్ట్రేలియా డాలర్ల ఖర్చు తగ్గించుకోవాలని, 2023 నుంచి ఏట 100 కోట్ల డాలర్లు ఆదా చేయాలని నిర్ణయించింది. 
 

click me!